భర్త.. మాజీతో ఒకే ఫ్రేమ్ లో దీపిక!

0

ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవాల్సిన సన్నివేశం వస్తే అలాంటి సందర్భాన్ని ఏ అమ్మాయి అయినా ఎలా హ్యాండిల్ చేయగలదు? ఇలాంటి ముక్కోణపు ప్రేమకథలతో సినిమాలెన్నో వచ్చాయి. బంపర్ హిట్లు కొట్టాయి. సరిగ్గా అలాంటి సన్నివేశంలోనే రణబీర్ కపూర్ నుంచి విడిపోయిన దీపిక .. కోస్టార్ రణవీర్ సింగ్ ని పెళ్లాడింది. ఆ క్రమంలోనే రణబీర్ అభిమానులంతా దీపికకు హేట్ మెయిల్స్ .. సంక్షిప్త సందేశాలు పంపించారు. ఆ తర్వాత ఆ ముగ్గురి జీవితాలు ఎలా టర్న్ అయ్యాయో తెలిసిందే. ఇండస్ట్రీలోనే ది బెస్ట్ హీరోగా రణవీర్ సింగ్ దూసుకుపోతున్నాడు. ఇండస్ట్రీ బెస్ట్ లేడీ సూపర్ స్టార్ గా దీపిక పదుకొనే రాణిస్తోంది. అందుకే బాలీవుడ్ లోనే ఆ జంట ఐడియల్ హాట్ కపుల్ గా పాపులారిటీని దక్కించుకున్నారు. రణబీర్ ప్రస్తుతం కుర్ర బ్యూటీ ఆలియా భట్ ప్రేమలో నిండా మునిగి ఉన్నాడు. ఈ జంట పెళ్లికి కపూర్-భట్స్ క్యాంపులు సన్నాహకాల్లోనే ఉన్నాయని ప్రచారమవుతోంది.

అదంతా ఒకెత్తు అనుకుంటే.. తాజాగా ఆ ముగ్గురూ ఒకే ఫ్రేమ్ లో కనిపించి అభిమానులకు సర్ ప్రైజ్ ట్రీటివ్వడం మరో ఎత్తు అనే చెప్పాలి. హాలీవుడ్ పాపులర్ గాయని క్యాటీ పెర్రీ ముంబైలో లైవ్ కాన్సెర్ట్ కోసం అడుగు పెట్టింది. ఈ కాన్సెర్ట్ అతిధులుగా రణబీర్-రణవీర్- దీపిక త్రయం ఎటెండవుతున్నారు. ఈ సందర్భంగా ఇదిగో ఇలా కింగ్ ఖాన్ షారూక్ తో కలిసి గుంపుగా ఫోజిచ్చారు. ఇందులో రణవీర్ సింగ్- దీపిక ఇద్దరినీ హగ్ చేసుకుని ఫోజిచ్చాడు రణబీర్ కపూర్. రణవీర్ యథావిధిగా తనదైన ఎనర్జీతో అల్లరోడిలా ఫోజివ్వగా ఆలియా మాత్రం ప్రియుడికి దూరంగా తన ఫేవరెట్ షారూక్ ఒడిలో కూచుని ఫోజిచ్చింది. ఇక వీళ్లందరితో పాటుగా ఫ్రేమ్ లోకి వచ్చిన అమీర్ ఖాన్ .. కరణ్ జోహార్ ఫ్రేమ్ లో హైలైట్ గా నిలిచారు.

కేటీ ముంబైలో అడుగు పెట్టిన తర్వాత.. తన కోసం కరణ్ జోహార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ముంబైలో కాటి పెర్రీ మొట్టమొదటి కచేరీకి సిద్ధమవుతోంది. ఈ కచేరీలో సైరా ఫేం అమిత్ త్రివేది ప్రదర్శన ఇవ్వనున్నారు. 2012 లో ఐపిఎల్- ఇండియా ప్రారంభోత్సవంలో కేటీ పెర్రీ ప్రదర్శన ఇచ్చిన సంగతి తెలిసిందే. అటుపై చాలా గ్యాప్ తర్వాత ఇన్నాళ్టికి మళ్లీ ముంబైలో అడుగుపెడుతోంది.

కేటీకి ఇండియాతో మరో కనెక్షన్ కూడా ఉంది. 2010 లో రణతంబోర్లో .. రస్సెల్ బ్రాండ్ ను వివాహం చేసుకున్నారు. ఆ ఇద్దరూ కేటీకి అత్యంత సన్నిహితులు కావడంతో నాటి నుంచి భారతదేశంలో తన అనుబంధం పెనవేసుకుని ఉందట. ఇక ప్రత్యేకించి కరణ్ జోహార్ పార్టీ ఇవ్వడానికి కారణం.. కేటీకి బి-టౌన్ స్టార్లను పరిచయం చేయాలన్న ఆలోచనేనట. షారూక్- అమీర్- రణబీర్-దీపిక- రణవీర్ సింగ్- వరుణ్ ధావన్- అలియా భట్- మలైకా అరోరా తదితరుల్ని కరణ్ ఆహ్వానించారట. బాలీవుడ్ స్టార్లు అంతర్జాతీయ గాయకులకు ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు.. షారుఖ్ ఖాన్ తన నివాసంలో పాప్ స్టార్ కోల్డ్ప్లేకి ఆతిథ్యమిచ్చారు. మరో పాపులర్ హాలీవుడ్ గాయని ఎడ్ షీరన్ కి బాలీవుడ్ లో ఆత్మీయ స్వాగతం పలికారు.
Please Read Disclaimer