చేతిలో చీపురు కట్టతో దీపిక మీమ్ వైరల్

0

దీపికా పదుకొనే లేటెస్ట్ ఫోటోషూట్లు అంతర్జాలం లో అగ్గి రాజేస్తున్న సంగతి తెలిసిందే. వరుస ఫోటోషూట్లతో సమ్మర్ మంటలు పెట్టేస్తోంది. నిన్నటికి నిన్న ప్రఖ్యాత ఎల్లే మ్యాగజైన్ కోసం చేసిన ఫోటోషూట్ ఫోటోలు అంతర్జాలంలో గిగాబైట్ స్పీడ్ తో పరుగులు పెట్టాయి. ఫ్యాన్స్ వాటిలోంచి రెడ్ హాట్ బికినీని వైరల్ గా షేర్ చేశారు. ఇక సముద్ర తీరంలో ఇసుక తిన్నెల్లో వేడెక్కించే వేరొక హాట్ లుక్ ను రివీల్ చేసింది.

అయితే ఈ కవర్ ఫోటోషూట్ నుంచి ఓ ఇమేజ్ ను ఒక కొత్త మీమ్ రూపంలో రివీల్ చేయడం ఆసక్తిని రేకెత్తించింది. హ్యారీ పాటర్ థీమ్ ఫ్లయింగ్ చీపురుని గాల్లోకి ఎత్తి చూపిస్తోంది దీపిక. ప్రస్తుతం ఈ మీమ్ అంతర్జాలంలో ఫ్యాన్స్ వాట్సాపుల్లో వైరల్ గా మారింది. దీనిపై రకరకాల జోకులు వేస్తుండడం వేడెక్కిస్తోంది.

ఇక దీపిక కెరీర్ సంగతి చూస్తే.. భర్త రణ్ వీర్ సింగ్ తో కలిసి స్పోర్ట్స్ డ్రామా `83`లో దీపిక కనిపించనుంది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కపిల్ దేవ్ బయోపిక్ అని ప్రచారమవుతోంది. భారత్ తొలి క్రికెట్ ప్రపంచ కప్ విజయంపై తెరకెక్కించిన చిత్రమిది. ఈ చిత్రంలో రణ్వీర్ కపిల్ పాత్రలో నటించగా.. కపిల్ దేవ్ భార్య రోమి పాత్రను దీపిక పోషిస్తోంది. 83 ఏప్రిల్ 10 న విడుదల కానుండగా.. ట్రైలర్ మార్చి 11న రిలీజ్ కానుంది. అలాగే అనన్య పాండే – సిద్ధాంత్ చతుర్వేదిలతో కలిసి ధర్మ ప్రొడక్షన్ మూవీకి దీపిక సిద్ధమవుతోంది. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రానికి షకున్ బాత్రా దర్శకత్వం వహించనున్నారు. మహాభారతం ఆధారంగా ఓ సినిమా కి సంతకం చేసింది. దీంతో పాటు వేరొక చిత్రానికి అంగీకరించిందట.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-