సన్నీలియోన్ వల్ల ఆ సామాన్యుడికి వింత కష్టం

0

బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్ కు ఏ స్థాయి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి సన్నీలియోన్ వల్ల ఢిల్లీకి చెందిన పునీత్ అగర్వాల్ అనే వ్యక్తికి వింత కష్టం వచ్చి పడింది. రోజుకు వందల కొద్ది కాల్స్ వస్తున్నాయి. ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఒక్కసారి సన్నీలియోన్ తో మాట్లాడించండి అంటూ కోరుతున్నారు. మరి కొందరు అసభ్యంగా ఫొటోలు పంపడం అశ్లీల వీడియోలు పంపడం మెసేజ్ లు పంపడం చేస్తున్నారట. దాంతో విసిగి పోయిన పునీత్ ఏకంగా పోలీసులను ఆశ్రయించాడు.

అసలు విషయం ఏంటీ అంటే… సన్నీలియోన్ తాజాగా ‘అర్జున్ పటియాలా’ అనే చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రంలో ఒకానొక సమయంలో సన్నీలియోన్ తన ఫోన్ నెంబర్ అంటూ ఒక ఫోన్ నెంబర్ ను చెప్పింది. సినిమా విడుదలైనప్పటి నుండి ఆ ఫోన్ నెంబర్ మోగుతూనే ఉంది. ఆ నెంబర్ పునీత్ అగర్వాల్ ది. గత 12 ఏళ్లుగా ఆ నెంబర్ ను పునీత్ వాడుతున్నాడట. ఈ కాల్స్ వల్ల తన వ్యాపారం కూడా దెబ్బ తింటుందని అతడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

నా అనుమతి లేకుండా నా ఫోన్ నెంబర్ ను వినియోగించినందుకు వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే అంటూ పునీత్ సీరియస్ గా ఉన్నాడు. ఈ కేసులో ప్రతి వాదులుగా ‘అర్జున్ పటియాలా’ చిత్ర దర్శకుడు.. నిర్మాత మరియు సన్నీలియోన్ లను చేర్చడం జరిగింది. ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. తనకు వారం రోజులుగా చాలా నష్టం జరిగిందని మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడ్డట్లుగా పునీత్ చెప్పుకొచ్చాడు.

సినిమాల్లో ఇలా ఇష్టం వచ్చిన నెంబర్ లు వాడితే ఇలాగే ఉంటుంది. ముఖ్యంగా సన్నీలియోన్ వంటి స్టార్స్ నోటి నుండి ఫోన్ నెంబర్ వస్తే ఇక ఎవరు మాత్రం ఆగుతారు. ఒక్క సారి ట్రై చేసి చూద్దాం పోయేది ఏముందని ప్రయత్నిస్తూనే ఉన్నారు.
Please Read Disclaimer