వెబ్ సిరీస్ నిర్మాణంలోకి దిగిన సూపర్ స్టార్

0

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంబీ ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్స్ ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తను నటించే సినిమాల్లో భాగస్వామిగా ఉంటూనే ఇతర సినిమా నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు సోనీ పిక్చర్స్ సహకారంతో అడవి శేష్ హీరోగా ‘మేజర్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

ఇదిలా ఉండగా ఎంబీ ప్రొడక్షన్స్ కి సంబంధించిన మరో న్యూస్ బయటకి వచ్చింది. ప్రముఖ దర్శకుడు దేవకట్టా – అమెజాన్ ప్రైమ్ సహకారంతో మహేష్ బాబు పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారేది దీని సారాంశం. ప్రతిభావంతులైనా సక్సెస్ చూడని దర్శకులలో ఒకరైన దేవ కట్టా ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని – అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని సమాచారం. యువ హీరో సాయిధరమ్ తేజ్ తో చేపట్టబోయే కొత్త సినిమాను దర్శకుడు దేవ కట్టా ఈ మధ్యే లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్న దేవ కట్టా – తేజ్ సినిమా పూర్తయ్యాక వెబ్ సిరీస్ డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనా మహేష్ బాబు డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతుండడంతో అభిమానులు తమ హీరో ఈ రంగంలో కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-