దేవరకొండ బ్రదర్స్ కు జూలై టెస్ట్

0

తక్కువ టైంలోనే యూత్ తో పాటు మార్కెట్ లోనూ బలమైన ఇమేజ్ ని సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను ఇవాళ తెరకు పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దీనికి నిర్మాత కాదు కానీ తమ్ముడి సినిమా పట్ల ఎంత ఎగ్జైటింగ్ గా ఉన్నాడో మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎమోషనల్ స్పీచ్ తో అందరికి అర్థమైపోయింది. దొరసాని మీద ప్రీ రిలీజ్ బజ్ బాగానే ఉంది. సెలెబ్రిటీలకు వేసిన స్పెషల్ షో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్నారు.

ఇంకొద్ది నిమిషాల్లో అన్ని చోట్లా షోలు పడబోతున్నాయి. అయితే తమ్ముడు ఆనంద్ మాత్రం మొదటి సినిమా అనే టెన్షన్ లేకుండా కూల్ గా ఉదయం 9 దాకా నిద్రపోతున్నాడని చెప్పిన విజయ్ తనకు మాత్రం డియర్ కామ్రేడ్ టెన్షన్ తో ఇప్పటి నుంచే కునుకు కష్టమయ్యేలా ఉందని చెప్పడం గమనార్హం. ఇప్పుడీ జులై నెల ఇద్దరు బ్రదర్స్ కి కీలకంగా మారబోతోంది. ఆనంద్ దేవరకొండ డెబ్యూతో ప్రూవ్ చేసుకోవాలి. రాజు పేద ప్రేమ ఫార్ములాతో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా కనక క్లిక్ అయితే హీరోగా పాస్ అయినట్టే.

మరోవైపు కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా విజయ్ దేవరకొండ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏడాదికి పైగా చేసిన డియర్ కామ్రేడ్ 26న రానుంది. కేవలం రెండు వారాల గ్యాప్ లో ఇద్దరు అన్నదమ్ముల సినిమాలు రిలీజ్ కావడం విశేషమే. రెండు హిట్ అయితే దేవరకొండ ఫ్యామిలీకి అంతకంటే ఆనందం ఇంకేముంటుంది. ఫస్ట్ టెస్ట్ ఆనంద్ ఈరోజు రాస్తుండగా నెలాఖరున సీనియర్ స్టూడెంట్ విజయ్ దేవరకొండ ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడీ సిరీస్ ని ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు
Please Read Disclaimer