మెగా హీరోలకు రౌడీ బాగా క్లోజ్!

0

`గీత గోవిందం` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు దేవరకొండ. ఆ సినిమా ప్రమోషన్స్ కి జీఏ2 తరపున బన్ని వాస్ కి అండగా అల్లు అరవింద్ బన్ని బోలెడంత ప్రచారం చేశారు. బన్ని ప్రీరిలీజ్ కి వస్తే సక్సెసేనని దేవరకొండ అన్నారు. ఇక ఈ సినిమాలో మెగా బ్రదర్ నాగబాబు కథానాయకుడు దేవరకొండకు తండ్రి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. రిలీజ్ అనంతరం ప్రివ్యూ చూశాక.. చిరంజీవి – చరణ్ తదితరులు దేవరకొండ పెర్ఫామెన్స్ ని పొగిడేశారు.

తనకు ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే మెగా హీరోలంతా తనని ప్రమోట్ చేయడంపై దేవరకొండ ఎంతో ఎగ్జయిట్ అయ్యాడు. ప్రతిభ ఉంటే ప్రోత్సహించేందుకు ఆ కాంపౌండ్ సిద్ధంగా ఉంటుందని దేవరకొండ ప్రశంసలు కురిపించాడు. అయితే గీత గోవిందం రిలీజ్ తర్వాత కెరీర్ పరంగా రకరకాల ప్రాజెక్టులతో బిజీ అయిపోయిన విజయ్ దేవరకొండ అటుపై వరుసగా ఇతర బ్యానర్లలో సినిమాలు చేస్తున్నాడు. అయినా ఇంకా మెగా హీరోలతో టచ్ లోనే ఉన్నాడా? అంటే.. పూర్తిగా టచ్ లో ఉన్నాడని తాజాగా అతడు చేసిన వ్యాఖ్యలు చెబుతున్నాయి.

నేటి సాయంత్రం హైదరాబాద్ జేఆర్సీలో జరిగిన `సూర్యకాంతం` ఆడియో ఈవెంట్ లో మాట్లాడిన విజయ్ దేవరకొండ మెగా మ్యాటర్స్ ని టచ్ చేశారు. దేవరకొండ మాట్లాడుతూ-“నిహారికకు తండ్రి గారయిన నాగబాబుతో కలిసి నటించాను. మొదటి ఐదు నిమిషాలు ఆయనతో మాట్లాడాక ఆయన మంచితనం తెలిసింది“ అని అన్నారు. మీరు మంచోడేనయ్యా! అని నాగబాబుతో అన్నానని సరదాగా నవ్వేశాడు దేవరకొండ. ప్రస్తుతం నాగబాబు రాజకీయాల్లో కి వెళ్లారని వరుణ్.. చరణ్ ఇద్దరూ అమెరికాలో ఉన్నారని చకచకా తడుముకోకుండా దేవరకొండ ఆ ఫ్యామిలీ వివరాలన్నీ చెప్పేశాడు. మొత్తానికి దేవరకొండ మెగా కాంపౌండ్ తో ఎంతో సన్నిహితంగానే ఉంటున్నారు. ఇకపోతే మెగా ప్రిన్సెస్ నిహారిక సినిమాని రౌడీ ప్రచారం చేసిన తీరు ఆసక్తికరం. దేవరకొండ వల్ల సూర్యకాంతం చిత్రానికి ప్రచారం పరంగా మైలేజ్ పెరుగుతుందనడంలో సందేహం లేదు. ఈనెల 29న ఈ చిత్రం రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ప్రణీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
Please Read Disclaimer