రేస్ నుంచి తప్పుకున్న దెయ్యం

0

వచ్చే నెల నుంచి వరసబెట్టి సినిమాల సందడి మొదలుకానుంది. ఏప్రిల్ 5 మజిలీతో మొదలయ్యే సందడి ఆపై కంటిన్యూ గా కొనసాగుతుంది. 12న సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి షెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే . ఇందులో దాదాపు ఏ మార్పు ఉండకపోవచ్చు. గతంలోనే ప్రకటించారు కాబట్టి దానికే కట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టీజర్ వచ్చాక అంచనాలు కూడా బాగా ఏర్పడ్డాయి.

అయితే అదే రోజు ప్రభుదేవా-తమన్నాల దేవి 2(తెలుగులో అభినేత్రి సీక్వెల్)విడుదల చేయబోతున్నట్టు గతంలోనే ప్రకటించారు. సక్సెస్ ఫుల్ హారర్ మూవీ సీక్వెల్ గా దీని మీద మంచి అంచనాలే ఉన్నాయి. కాని ఇప్పుడిది రేస్ నుంచి తప్పుకుంది. స్వయానా దర్శకుడు విజయ్ దీన్ని వెల్లడించడంతో పోటీకి చెక్ పడింది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి

మొదటిది అదే రోజు విజయ్ దర్శకత్వం వహించిన మరో సినిమా క్రైమ్ థ్రిల్లర్ వాచ్ మెన్ రిలీజ్ అవుతోంది. క్లాష్ కాక తప్పడం లేదని విజయ్ ఇంతకు ముందు అన్నాడు. ఇప్పుడా సమస్య లేదు. ఇక రెండో రీజన్ డబ్బింగ్ వెర్షన్లు. తెలుగు కన్నడకు సంబంధించి ఇంకా హక్కుల లావాదేవీలు పూర్తి కాలేదు. ఒకేసారి రిలీజ్ చేయాలి కాబట్టి డీల్ క్లోజయ్యే దాకా వదిలే ఛాన్స్ ఉండదు.

సో దేవి 2 కనీసం నెల రోజులకు పైగా వాయిదా ఖరారు అయిపోయింది. అలా చూసుకుంటే తేజుకు ఉన్న ఒకే ఒక్క పోటీ పక్కకు తప్పుకున్నట్టే. అదేమి తీవ్ర ప్రభావం చూపించే సినిమా కాకపోయినా ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ దిగులూ లేదు కాబట్టి 12న సోలోగా చిత్రలహరులు సందడి చేయవచ్చు.
Please Read Disclaimer