దేవి ప్లేస్ లో మణిశర్మ ఏం జరిగందంటే ?

0

టాలీవుడ్ లో కొందరు దర్శకులు ఒకే మ్యూజిక్ డైరెక్టర్ తో వర్క్ చేస్తూ తమ బాండింగ్ తో బెస్ట్ అవుట్ పుట్ పొందుతుంటారు. ఆ లిస్టులో రాజమౌళి -కీరవాణి సుకుమార్ -దేవి శ్రీ ప్రసాద్ ఇలా కొందరు వస్తారు. అయితే ఇప్పుడీ లిస్టులో నుండి ఇద్దరు దర్శకులు ట్రాక్ మార్చేసారు.

అవును దేవి శ్రీ ప్రసాద్ లేకుండా కొరటాల శివ సినిమా ఇంత వరకూ రాలేదు. చేసిన నాలుగు సినిమాలకు దేవినే మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకొని బెస్ట్ ఆల్బమ్స్ అందుకున్నాడు కొరటాల. ఓ ఇంటర్వ్యూ తనకి మ్యూజిక్ గురించి ఏం తెలియదని అందుకే మ్యూజిక్ లో బెస్ట్ అయిన దేవినే కంటిన్యూ చేస్తున్నానని చెప్పాడు కొరటాల. అయితే ఉన్నపళంగా ఇప్పుడు చిరు సినిమాకు మణిశర్మను ఫైనల్ చేసుకున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిందేమిటంటే చిరు సినిమాకు కొరటాల కంటే మెగా కాంపౌండ్ నిర్ణయమే కీలకం.

ఇక దేవిని కంటిన్యూ గా రిపీట్ చేసే మరో దర్శకుడు కిషోర్ తిరుమల కూడా ఈ సారి ‘రెడ్’ సినిమాకు దేవి కాకుండా మణిశర్మనే తీసుకున్నాడు. అయితే ఇందులో కూడా కిషోర్ నిర్ణయం కంటే రామ్ రవి కిషోర్ ల నిర్ణయమే కీలకం. తనకి ఇస్మార్ట్ శంకర్ లాంటి బెస్ట్ ఆల్బం అందించడం పైగా రెడ్ బాగ్రౌండ్ స్కోర్ కి ఎంతో ఇంపార్టెన్స్ ఉండే క్రైం థ్రిల్లర్ కావడంతో దేవి కాదని మణిశర్మ ఓటేశారు మేకర్స్. సో ఇలా ఈ రెండు సినిమాలకు దేవిను కాదని తన గురువు మణికి చాన్స్ ఇచ్చారు. మరి మణిశర్మ ఈ రెండు సినిమాలకి ఎలాంటి అవుట్ పుట్ ఇస్తారో చూడాలి.
Please Read Disclaimer