పవన్28 కి దేవి రికార్డు రెమ్యూనరేషన్

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్ ల కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాకు పాటలను దేవి శ్రీ ప్రసాద్ అందించాడు. గబ్బర్ సింగ్ ఆడియో సూపర్ హిట్ అయ్యి సినిమా హిట్ లో కీలక పాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు. సుమారు ఎనిమిది ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే కాంబో రిపీట్ అవ్వబోతుంది. పవన్ 28వ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే సినిమా ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నందుకు గాను దేవి శ్రీ ప్రసాద్ ఏకంగా రూ.2 కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకోబోతున్నాడట.

టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న సంగీత దర్శకుడిగా దేవిశ్రీకి పేరు ఉంది. రంగస్థలం.. సరిలేరు నీకెవ్వరు సినిమాలకు దాదాపుగా కోటిన్నర వరకు పారితోషికం అందుకున్న దేవిశ్రీ ప్రస్తుతం బన్నీ సుకుమార్ ల కాంబో మూవీ ‘పుష్ప’ కు సంగీతాన్ని అందించేందుకు గాను కాస్త అటు ఇటుగా అంతే పారితోషికంను అందుకుంటున్నాడట. కాని పవన్ 28 సినిమాకు మాత్రం రెండు కోట్లు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈమద్య కాలంలో ఈయన పాటల్లో వాడి వేడి తగ్గిందనే విమర్శలు వస్తున్నాయి. అవేమి పట్టించుకోకుండా పారితోషికంను పెంచేశాడు. గబ్బర్ సింగ్ రేంజ్ ఆడియోను మెగా అభిమానులకు ఈయన అందిస్తాడా అనేది చూడాలి.