మ్యూజిక్ డైరెక్టర్ లైట్ తీసుకున్నారుగా!

0

ఎవరి గురించయినా సక్సెస్ ఉన్నంత వరకే మాట్లాడుకుంటారు. ఇండస్ట్రీ లో ఆ రూల్ మరీ ఎక్కువగా ఫాలో అవుతుంటారు. వర్క్ లో సక్సెస్ అవ్వకపోతే పక్కన పెట్టేస్తారు. ఇదంతా ఎందుకంటే నిన్న సరిలేరు ఈవెంట్ లో దేవి శ్రీ ప్రసాద్ ని ఇలాగే అందరూ పక్కన పెట్టారు.

ఆల్బం పెద్దగా హిట్ అవ్వకపోవడం నెగిటీవ్ కామెంట్స్ అందుకోవడంతో మెగాస్టార్ – మహేష్ బాబు కూడా లైట్ తీసుకొని దేవి గురించి మాట్లాడటమే మర్చిపోయారు. సినిమా గురించి మహేష్ – విజయ్ శాంతి గురించి ఇలా అందరి గురించి ఓ అరగంట మాట్లాడిన చిరు దేవి గురించి పెద్దగా ఏం చెప్పలేదు. చివర్లో నిన్ను మర్చిపోయాను అనుకుంటున్నావేమో నీ గురించి చెప్పి చెప్పి రొటీన్ అయింది అన్నట్టుగా ఏదో పై పైన చెప్పి దేవి శ్రీ దగ్గరి వచ్చే లోపే ముగించేసాడు.

ఇక మహేష్ కూడా అంటే దేవి గురించి చెప్పడం మర్చిపోయాను అంటూ తర్వాత లాస్ట్ లో ఓ లైన్ మాత్రమే చెప్పాడు. ఆడియో లు లేవు కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ గురించి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే చెప్పాల్సి వస్తుంది. కానీ అదిరిపోయే ఆల్బం ఇవ్వలేని కారణం చేత దేవి గురించి స్టార్స్ ఎవరూ పెద్దగా మాట్లాడలేదు.
Please Read Disclaimer