మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన దేవిశ్రీ

0

ఏ హీరో 25వ సినిమా అయినా ఆ హీరో ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోలు కూడా తమ అన్ని సినిమాలకు బెంచ్ మార్క్ నెంబర్ మూవీ చాలా విభిన్నంగా ఉండాలనే ఉద్దేశ్యంతో కొత్తగా ట్రై చేస్తారు. తాజాగా మహేష్ బాబు బెంచ్ మార్క్ చిత్రంకు సిద్దం అయ్యాడు. మహేష్ బాబు 25వ చిత్రంగా మహర్షి రూపొందుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన మహర్షి చిత్రం ఏప్రిల్ లో విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల మే కి వాయిదా వేయడం జరిగింది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపేలా సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ ఒక గుడ్ న్యూస్ ను అనౌన్స్ చేశాడు. మార్చి 29న ‘మహర్షి’ నుండి మొదటి సాంగ్ రాబోతున్నట్లుగా ప్రకటించాడు. మహేష్ బాబు – దేవిశ్రీ ప్రసాద్ ల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా శ్రీమంతుడు మరియు భరత్ అనే సినిమాల పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలోని పాటలకు కూడా తప్పకుండా పాజిటివ్ రెస్పాన్స్ దక్కడం ఖాయం అనే నమ్మకంతో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు. ఇలాంటి సమయంలో దేవిశ్రీ ప్రసాద్ పాట విడుదలకు సంబంధించి ప్రకటన చేయడం ఫ్యాన్స్ కు ఖచ్చితంగా గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు.

దేవిశ్రీ ప్రసాద్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పడంతో పాటు – మహేష్ బాబు కూతురుకు సంబంధించిన ఒక వీడియోను కూడా పోస్ట్ చేశాడు. తాను పాట పాడుతుండగా సితార పాప డాన్స్ వేస్తున్న వీడియోను దేవిశ్రీ ప్రసాద్ పోస్ట్ చేశాడు. ఆ వీడియోకు మహేష్ బాబు ఫ్యాన్స్ నుండి విశేష ఆధరణ దక్కుతుంది. గుడ్ న్యూస్ తో పాటు – ఒక మంచి వీడియోను పోస్ట్ చేసినందుకు కృతజ్ఞతలు అంటూ దేవిశ్రీ ప్రసాద్ కు ఫ్యాన్స్ రిప్లై ఇస్తున్నారు.
Please Read Disclaimer