తమన్ ని బీట్ చేయలేకపోతున్నాడే!

0

ఇండస్ట్రీలో ప్రతీ క్రాఫ్ట్ లో పోటీ అనేది కామన్. అది ఉంటేనే టెక్నీషియన్స్ నుండి బెస్ట్ అవుట్ పుట్ వస్తుందనడంలో సందేహమే లేదు. అయితే ఇప్పుడు మ్యూజిక్ లో అలాంటి పోటీ నే దేవి కి తమన్ కి మధ్య నెలకొంది. ప్రస్తుతం వీరిద్దరూ నువ్వా నేనా అనే మోడ్ లో సాంగ్స్ తో ఎట్రాక్ట్ చేయాలని చూస్తున్నారు. ఈ విషయంలో తమన్ దేవి కంటే ముందున్నాడు. అవును ప్రస్తుతం తమన్ మ్యూజిక్ హవా నడుస్తుంది.

తమన్ దాటికి దేవి అసలు ఎక్కడా కనిపించడమే లేదు. సంక్రాంతి నుండి వీరిద్దరి పోటీ మొదలైంది. తమన్ ‘అల వైకుంఠపురములో’ అదిరిపోయే ఆల్బం అందించి సినిమా విజయం కీలకం అవ్వగా. దేవి సరిలేరు నీకెవ్వరు’ ఆల్బం కి నెగిటీవ్ ఫీడ్ బ్యాక్ అందుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక వరుసగా తమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ రిలీజవుతూ అవి ప్రేక్షకాదరణ పొందుతుంటే దేవి మాత్రం సైలెంట్ అయిపోయాడు.

నిజానికి సాంగ్స్ ను తమన్ ప్రమోట్ చేసుకున్నట్టుగా దేవి ప్రమోట్ చేసుకోలేకపోతున్నాడు. లేటెస్ట్ గా వకీల్ సాబ్ లో సాంగ్ తో ఇరవై నాలుగంటలు ట్విట్టర్ లోనే ఉంటూ సరైన విధంగా ప్రమోట్ చేస్తూ అందరికీ రిప్లై ఇస్తూ వారిని ట్వీట్స్ ఖుషి చేసి తన మ్యూజిక్ కి హైలైట్ చేసుకుంటున్నాడు. ఈ విషయంలో దేవి వెనకంజలో ఉండిపోతున్నాడు. అవును దేవి మీడియాను సరిగ్గా వాడుకోలేకపోతున్నాడు. నిజానికి దేవి మీడియా ప్రతినిధులతో టచ్ లో కూడా ఉండదని దేవితో పోలిస్తే తమన్ అందరితో టచ్ లో ఉంటూ మన మనిషి అని ఫీలయ్యేట్టుగా ఉంటాడట. మరి దేవి ఉప్పెన ఆల్బంతో అయినా తమన్ ని ఫాలో అయి సోషల్ మీడియాలో తన సాంగ్స్ తో ప్రమోట్ చేసుకుంటే బాగుంటుంది. లేదంటే తమన్ ఇంకా ముందుకెళ్ళడం ఖాయం..
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-