జబర్ధస్త్ మూల పురుషుడు నాగబాబు కాదు!

0

బుల్లితెర ఎంటర్ టైన్ మెంట్ షో జబర్దస్త్ గురించి పరిచయం అవసరంలేదు. ఆ షో ఎందరికో ఉపాధినిచ్చింది. తిండి పెట్టి పెద్ద స్టార్లను కూడా చేసేసింది. పలువురు ఇప్పటికే సినిమాల్లో అవకాశాలు అందుకుని రాణిస్తున్నారు. ఔత్సాహికులకు ఆ వేదిక కెరీర్ ను మలుచుకోవడానికి ఎంతో ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తమలో ట్యాలెంట్ ను గుర్తించి పైకి తీసుకొచ్చిన షో అది. తిండికి టికాణా లేక ఆకలి తో అల్లాడిన కళాకారుల బాధలను తీర్చిన షో అది. అందుకే జబర్దస్త్ గురించి..ఆ షోలో నటించి పైకి వచ్చిన వారంతా ఎంతో గొప్పగా చెబుతుంటారు. మరి ఈ షో ప్రారంభానికి అసలు మూల పురుషుడు ఎవరు? అంటే ఆసక్తికర సంగతులే తెలుస్తున్నాయి. ఈ షో ఐడియా..ప్రారంభానికి అసలు కారకుడు కమెడీయన్ ధనరాజ్ అట. ఆయన వల్లే ఈ షో ప్రారంభమైందని తర్వాత ఎంతో మంది ట్యాలెంట్ గల నటులు రావడం వల్లనే షో ఇంకా పాపులర్ అయిందని ధన్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

మరి ఈ తరహా షోకు బీజం ఎలా పడింది అంటే. జగడం..పరుగు..గోపి గోపిక గోదావరి భీమిలి కబడ్డీ జట్టు వంటి సినిమాల తో అప్పటికే పాపులర్ అయిన తన మేనేజర్ ఏడుకొండలు తనను కలిసి ఓ కాన్సెప్ట్ చెప్పాడట.అందులో పాత్ర ధారులుగా చంద్ర- రోలర్ రఘు- వేణు అయితే బాగుటుందని ముందుగా తానే ఒప్పించాడుట. వాళ్లకి ఎంత ఇవ్వాలి వంటి విషయాలు కూడా తానే ఫైనల్ చేసానని ధనరాజ్ తెలిపాడు. తొలిగా 13 ఎపిసోడ్లు చేసామని… షో లో తొలి స్కిట్ ధనరాజ్ దేనట. అప్పుడు విన్నర్ గా కూడా తన టీమ్ గెలిచిందన్నాడు. తర్వాత షో స్వరూపం మారిందని కొంత మంది కొత్త వాళ్లు వచ్చి నిరూపించుకున్నారని..తర్వాత అప్పుడప్పుడు మధ్యలో వెళ్లి తాము ఎంటర్ టైన్ చేసామని తెలిపాడు.

అలా సాగుతోన్న సమయంలో అనుకోకుండా నాగబాబు బయటకు వచ్చేసారని తెలిసింది. అప్పుడే నాగబాబు ధన్ రాజ్ కి ఫోన్ చేసి అదిరిందిలో చేయమని అడిగారని తెలిపాడు. జబర్దస్త్ లో ఉన్న లీడర్స్ పైకి రావడానికి కారణం నాగబాబు అని అన్నారు. ఆయన వల్లే ఈరోజు ఇళ్లు..కార్లు కొనుక్కోగలిగామని..అలాంటి ఆయన పిలిచాక వెళ్లకుండా ఉంటామా? అని ధన్ రాజ్ వ్యాఖ్యానించారు. అయితే మెగా బ్రదర్ జబర్దస్త్ ని వదలడానికి కారణం మాత్రం రివీల్ చేయలేదు సుమీ.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-