స్టార్ డైరెక్టర్ తో స్టార్ హీరో గొడవలు?

0

క్రియేటివ్ డిఫరెన్సెస్ .. ఇటీవల రెగ్యులర్ గా వినిపిస్తున్న మాట ఇది. ఫలానా హీరో ఫలానా దర్శకుడి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తాయని .. లేదూ దర్శకనిర్మాతల మధ్య విభేధాలు తలెత్తాయని చెప్పుకోవడం వింటున్నదే. దీనివల్ల సహృద్భావ వాతావరణం లేకపోవడంతో కొన్నిసార్లు ప్రాజెక్ట్ మిడిల్ డ్రాప్ అయ్యేవరకూ వెళుతోంది. ఒక్కోసారి ఆరంభమే హంసపాదులా ఈ డిఫరెన్సెస్ సమస్యను ఇంకా పెంచేస్తున్నాయి.

ఇలాంటి ఏదో ఒక సమస్య లేనిదే ఏ దర్శకుడూ తన సినిమాని ఏళ్ల తరబడి తీయడు. క్రియేటివ్ డిఫరెన్సెస్ తో హీరోలు ఫింగరింగ్ చేసినా డైరెక్టర్లు కక్ష తీర్చుకుంటారన్న సంగతి ప్రూవైంది గతంలో. అయితే ఆ స్టార్ డైరెక్టర్ .. ఆ స్టార్ హీరో మధ్య ఏమైందో కానీ ఆ ప్రాజెక్టు ప్రారంభమై రెండున్నరేళ్లు అయినా ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోలేదు. పదే పదే రిలీజ్ వాయిదా పడడం చర్చకు వచ్చింది. ఇటీవలి కాలంలో అయితే అసలు ఆ ప్రాజెక్టు ఉందో లేదో కూడా అభిమానులు మర్చిపోయారు.

ఇద్దరూ క్రేజు ఉన్నవాళ్లే… అయినా ఎందుకిలా అయ్యిందో కానీ.. ఈ విషయంలో హీరో ఆ దర్శకుడిపై సీరియస్ గానే ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. కారణం ఏదైనా ఇప్పుడు రిలీజ్ ముంగిట ఈ సినిమా ప్రచారం లో దర్శకుడు కనిపించక పోవడం హాట్ టాపిక్ అయ్యింది. దీంతో హీరోనే దర్శకుడిని దూరం పెట్టాడని .. కాదు.. దర్శకుడే హీరోని పట్టించుకోవడం లేదని చర్చ సాగుతోంది. ఎట్టకేలకు ఈ సినిమా తూటా పేరు తో తెలుగు లో రిలీజవుతోంది.

ఇంతకీ ఎవరా దర్శకుడు.. ఎవరా హీరో? అంటే.. గౌతమ్ మీనన్- ధనుష్ గురించే. ఆ ఇద్దరూ కలిసి `ఎన్నయ్ నోకి పాయుమ్ తోట` చిత్రానికి పని చేశారు. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ నెల 29న రిలీజవుతోంది. తెలుగులోనూ లైన్ క్లియర్ చేసుకుని వస్తోంది. ఈ చిత్రంలో లై ఫేం మేఘా ఆకాష్ కథానాయిక గా నటిస్తోంది. రిలీజ్ వేళ దర్శకుడు గౌతమ్ మీనన్ కనీస మాత్రంగా అయినా ఈ సినిమా గురించి సోషల్ మీడియాల్లో కూడా ప్రస్థావించకపోవడం చూస్తుంటే హీరోతో దర్శకుడి క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏ రేంజులో ఉన్నాయోనన్న గుసగుసలు వేడెక్కిస్తున్నాయి.
Please Read Disclaimer