లుక్స్ తోనే అదరగొట్టిన సూపర్ స్టార్ అల్లుడు

0

పేరుకు సూపర్ స్టార్ రజనికాంత్ అల్లుడు అనే పేరున్నప్పటికి తనకంటూ స్వంత ఐడెంటిటీ ఏర్పరుచుకున్న ధనుష్ హీరోగా దర్శకుడిగా రాణిస్తూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న సంగతి తమిళ సినిమాలను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళకు తెలిసిన సంగతే. ఇతని కొత్త చిత్రం అసురన్ తాలుకు పోస్టర్లు లుక్స్ టాక్ అఫ్ ది సౌత్ గా మారాయి. జాతీయ అవార్డు విన్నర్ వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందుతున్న అసురన్ లో ధనుష్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషిస్తున్నాడు.

తాజాగా రిలీజైన పోస్టర్ లో 80ల కాలం నాటి గెటప్ మీసకట్టుతో చాలా డిఫరెంట్ గా కనిపిస్తూ అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చాడు. కొద్దిరోజుల క్రితం ఇదే సినిమా తాలుకు వేరే పోస్టర్ లో ఊర మాస్ గెటప్ తో షాక్ ఇచ్చిన ధనుష్ ఇప్పుడు ఈ అవతారంలో వావ్ అనిపించాడు. అసురన్ మీద కోలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. గత ఏడాది ఇదే కాంబినేషన్ లో వచ్చిన వడ చెన్నై సంచలన విజయం సాధించింది. నేటివిటీ ఫ్యాక్టర్ వల్ల దాన్ని తెలుగులో డబ్బింగ్ చేయకపోవడంతో మనవాళ్ళు మంచి సినిమా మిస్ అయ్యారు.

ఇప్పుడీ అసురన్ అయినా తెలుగులో రావాలని మనవాళ్ళు కోరుతున్నారు. మొత్తానికి ఇలా లుక్స్ తోనే మెస్మరైజ్ చేస్తున్న ధనుష్ అసురన్ లో చాలా వేరియేషన్స్ చూపించాడని చెన్నై టాక్. ఇందులో మంజు వారియర్ హీరొయిన్ గా నటిస్తోంది. ట్విస్ట్ ఏంటంటే ఆవిడ ధనుష్ కంటే ఐదేళ్ళు పెద్ద. పాత్ర డిమాండ్ మేరకు కావాలనే ఇలా తీసుకున్నట్టు తెలిసింది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న అసురన్ ఈ ఏడాదే విడుదలయ్యే ఛాన్స్ ఉంది
Please Read Disclaimer