తమిళ సినిమాల్లో మాత్రమే ఇది సాధ్యం

0

తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ అంటే పాతిక ఏళ్ల వయసు లోపు వారు మాత్రమే ఉంటారు. ఎక్కువ శాతం హీరోయిన్స్ చిన్న వయసు అమ్మాయిలే ఉంటారు. కాని తమిళంలో మాత్రం హీరోయిన్స్ వయసుతో సంబంధం లేకుండా ఉంటారు. తమిళ హీరోలు పాత్రకు తగ్గట్లుగా పెద్ద వయసు ఆంటీలతో రొమాన్స్ చేసిన సందర్బాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ధనుష్ తన సినిమాలో హీరోయిన్ గా నాలుగు పదుల వయసుకు దగ్గరగా ఉన్న హీరోయిన్ స్నేహతో రొమాన్స్ చేస్తున్నాడు.

‘పట్టాస్’ పేరుతో ధనుష్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్ గా స్నేహా నటిస్తోంది. నాగార్జున.. వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో గతంలో సినిమాలు చేసిన స్నేహ పెళ్లి పిల్లల తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తోంది. మరో వైపు వెబ్ సిరీస్ లను కూడా చేసేందుకు స్నేహా సిద్దంగా ఉంది. ఇలాంటి సమయంలో ఈమెకు ధనుష్ తో చేసే అవకాశం దక్కించుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్న ఈ ఆంటీకి హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడం ధనుష్ కు మాత్రమే చెల్లింది.

తెలుగు హీరోలు ఎవరు కూడా అంత వయసు ఉన్న హీరోయిన్ తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించరు. మన స్టార్ హీరోలు ఒక వేళ స్నేహకు ఛాన్స్ ఇచ్చినా అమ్మగా.. అక్కగా లేదంటే అత్త పాత్రలకు మాత్రమే ఛాన్స్ ఇస్తారు. కాని ధనుష్ మాత్రం ఆమెకు హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సక్సెస్ పుల్ పాత్రలు చేసిన స్నేహా పట్టాస్ చిత్రంతో మరోసారి హీరోయిన్ గా ఆకట్టుకుంటుందో చూడాలి.
Please Read Disclaimer