ధన్య బాలక్రిష్ణ రెమ్యునరేషన్ తెలిస్తే.. ఇండస్ట్రీ ఎలాంటిదో అర్థమై పోతుంది

0

పేరు చెప్పినంతనే గుర్తు పట్టే వారు ఉంటారు కానీ.. ఫోటోను చూసినంతనే ఓహ్.. ఈమేనా ధన్య అనేస్తారు. హీరోయిన్ క్వాలిటీస్ అన్ని ఉన్నా.. కొందరికి కాలం కలిసి రాదు. ఆ విషయాన్ని ధన్య బాలక్రిష్ణ ను చూస్తే ఇట్టే అర్థమైపోతోంది. హీరోయిన్ కు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నా.. ఎంట్రీ వేళ సరైన సినిమా పడకపోవటంతో ఆమె నటిగా మిగిలింది. ఇటీవల సాఫ్ట్ వేర్ సుధీర్ చిత్రంలో వార్తల్లోకి వచ్చింది.

అందులో సుడిగాలి సుధీర్ తో జత కట్టటంతో ఆమె పేరు మీడియా లో బాగానే నానింది. ఈ సినిమా విడుదలైనప్పటికీ థియేటర్లలో పెద్దగా కనిపించక పోవటం వెనుక విషయాలు తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కోసం తాజాగా ధన్య బాలక్రిష్ణ ఒక మీడియా సంస్థ తో మాట్లాడారు. ఈ సందర్భం గా ఆమె నోటి నుంచి వచ్చిన మాటలు వింటే అవాక్కు అవ్వాల్సిందే. ఎందుకంటే.. ఆమె తన రెమ్యునరేషన్ గురించి చెబుతూ.. అందులో దాచి పెట్టుకోవాల్సిందేమీ లేదని చెప్పుకొచ్చింది.

తాను స్టార్టింగ్ రోజుల్లో రోజుకు రూ.4వేలు మాత్రమే ఇచ్చేవారని చెప్పింది. ఇప్పుడు తన రేంజ్ పెరిగిందని చెప్పిన ధన్య.. తనకెంత వస్తుందో మాత్రం చెప్పలేదు. మొత్తానికి స్టార్టింగ్ రోజుల్లో రోజుకు రూ.4వేల రెమ్యునరేషన్ అంటే.. సినిమా ఇండస్ట్రీ ఎంత కఠినంగా ఉంటుందనటానికి ఇదో చక్కటి ఉదాహరణగా చెప్పక తప్పదు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-