విడాకులు తీసుకున్న మరో బాలీవుడ్ నటి

0

ఏమైందో ఏమో కానీ ఏళ్లకు ఏళ్లు కలిసి ఉన్న వారు సైతం విడిపోతున్నారు. బాలీవుడ్ లో పెరిగిన ఈ ట్రెండ్ కు తగ్గట్లే తాజాగా మరో ప్రముఖ బాలీవుడ్ నటి తన వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లుగా ప్రకటించి అందరికి షాకిచ్చారు. ప్రముఖ నటి దియామీర్జా తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పేస్తూ.. ఆ విషయాన్ని ఇన్ స్టా లో తాజాగా వెల్లడించారు.

ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త సాహిల్ సంఘా.. దియా చాలాకాలం పాటు ప్రేమించుకున్నారు. చివరకు ఐదేళ్ల క్రితం అంటే.. 2014లో వారు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఏమైందో ఏమో కానీ.. వారు తామిద్దరం విడిపోతున్నట్లు ప్రకటించారు. పదకొండేళ్లుగా ఒకరితో ఒకరు జీవితాల్ని పంచుకొని.. ఇప్పుడు పరస్పరం విడిపోవాలని డిసైడ్ అయినట్లుగా ప్రకటించారు.

ఎప్పటికి స్నేహితుల మాదిరి ఉండాలని.. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలని.. తమ ప్రయాణాలు విభిన్నంగా ఉన్నా.. ఎప్పటికి ఫ్రెండ్స్ మాదిరి ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పారు. తమను అర్థం చేసుకొని గౌరవించిన తల్లిదండ్రులకు.. బంధువులకు.. స్నేహితులకు వారిద్దరూ ధన్యవాదాలు తెలిపారు. దాదాపు ఆరేళ్ల లవ్ తర్వాత పెళ్లి చేసుకొన్న వీరిద్దరూ ఐదేళ్ల వైవాహిక బంధానికి తాజాగా ఫుల్ స్టాప్ పడింది. తమ విడాకుల విషయాన్ని వెల్లడించిన దియా.. తమకు ప్రైవసీ కల్పిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

దియా అమాయకత్వం కానీ.. ఇప్పుడే కదా సగటు జీవిలో ఉత్సుకత మొదలయ్యేది. ఎందుకు విడిపోయారు? ఏ కారణంతో వారిద్దరి మధ్య వివాహ బంధం తెగింది? దానికి కారణం ఏమిటి? ఈ ఇద్దరు ఇప్పుడు పయనిస్తున్న మార్గాలేమిటి? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సిన వేళ.. ఇక పట్టించుకోవద్దంటే ఎలా దియా? అంటూ ప్రశ్నిస్తున్నోళ్లు లేకపోలేదు.
Please Read Disclaimer