పెదరాయుడినే పడగొట్టిన సంపూ

0

నిన్న సైలెంట్ గా విడుదలైన కొబ్బరిమట్ట కొత్త ట్రైలర్ ఆన్ లైన్లో సునామిగా మారింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో దీని గురించిన పొగడ్తల పర్వం కొనసాగుతూనే ఉంది. 3 నిమిషాల 27 సెకండ్లు గుక్క తిప్పుకోకుండా అతి క్లిష్టమైన పదాలను వాడి టెంపో తగ్గకుండా సంపూ చేసిన డైలాగ్ డెలివరీ ఇప్పుడీ సినిమాకు డబుల్ హైప్ తెచ్చేసింది. స్టోరీ ప్రకారం పెదరాయుడి మనవడిగా ఆండ్రాయిడు పేరుతో వెరైటీ రోల్ చేస్తున్న సంపూ ఇప్పుడు ఏకంగా నిజమైన పెదరాయుడి దృష్టిలో పడ్డాడు.

అవును కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ ట్రైలర్ చూశారట. అంతేకాదు ప్రత్యేకంగా సంపూకు ఫోన్ చేసి మరీ అభినందనలు తెలపడంతో హీరో ఆనందం మాములుగా లేదు. స్వయంగా ఈ విషయాన్ని సంపూర్ణేష్ బాబు షేర్ చేసుకుంటూ ఎవరి డైలాగ్స్ వింటూ చూస్తూ స్ఫూర్తిగా తీసుకుని ఎదిగానో ఆయనే స్వయంగా గ్రీటీంగ్స్ చెప్పడం తనలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పాడు . తాను పుట్టిన గ్రామంలో మోహన్ బాబు గారి సంభాషణలే ప్రాక్టీస్ చేసి ఆయన వల్లే పరిశ్రమకు రావాలనుకున్న తనకు ఇప్పుడు ఆ రోల్ మోడల్ నుంచే స్వయంగా కాంప్లిమెంట్స్ అందుకోవడం కన్నా ఏం కావాలని సంతోషం వెలిబుచ్చాడు.

మోహన్ బాబు అనే కాదు ఇండస్ట్రీలోని ఇతర హీరోల నుంచి కూడా సంపూకు ప్రశంశల వెల్లువ దక్కుతోంది. వచ్చే నెల 10న విడుదల కానున్న కొబ్బరిమట్ట ఒక్క రోజు గ్యాప్ తో మన్మథుడు 2తో పోటీ పడుతోంది. కొసమెరుపు ఏంటంటే ఇప్పుడీ 3 నిమిషాల డైలాగు ముందు లేదట. ఆఖరి నిమిషంలో ఐడియా వస్తే అప్పటికప్పుడు ఖర్చు అవుతుందని తెలిసినా అప్పు చేసి మరీ తీశామని దీనికోసం సంపూ గంటల తరబడి కఠోర సాధన చేసినట్టుగా నిర్మాత కం రచయితల్లో ఒకరైన సాయి రాజేష్ చెప్పడం గమనార్హం.
Please Read Disclaimer