డైరెక్టర్ చొక్కా విప్పి చూపించమన్నాడు!

0

సీనియర్ నటుడు నానా పటేకర్ పై తనుశ్రీ దత్తా ఆరోపణలతో మీటూ ఉద్యమం ఏ స్థాయికి చేరుకుందో తెలిసిందో. ఎందరో బాధితుల్లో ధైర్యాన్ని నింపిన ఘటన అది. పలువురు నటీమణులు ధైర్యంగా ముందుకొచ్చి తమపై జరిగిన లైంగిక దాడులను పబ్లిగ్గా వెల్లడించి చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేసారు. ఇది జరిగిన కొన్ని నెలలు గడుస్తున్నా! ఇంకా అడపదడపా బాధితులు అప్పుడుప్పుడు తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొస్తూనే ఉన్నారు. తాజాగా బిగ్ బాస్ హిందీ వెర్షన్ మాజీ కంటెస్టెంట్ పాయల్ రోహిత్గీ మరోసారి కాస్టింగ్ కౌచ్ అంశాన్ని లేవనెత్తింది. బాలీవుడ్ డైరెక్టర్ దిబాకర్ బెనర్జీ పై సంచలన ఆరోపణలు చేసింది.

పాయల్ కు ఒక సినిమా అవకాశం ఇస్తానని దిబాకర్ వేధించాడట. 2011లో దిబాకర్ బాలీవుడ్ కి పరిచయం చేస్తానని మెసేజ్ పంపించాడుట. ఆ తర్వాత తనని పరిచయం చేసుకుని స్నేహం చేసాడుట. దీంతో పాయల్ తనకో మంచి మెంటార్ దొరికాడని సంతోషించానని తెలిపింది. ఈసమయంలోనే తనకు- రాహుల్ మహాజన్ కు ఉన్న సంబంధం పై చర్చ జరిగింది. తర్వాత షాంఘై సినిమాలో అవకాశం ఇస్తానని మాట ఇచ్చిన దగ్గర నుంచి సమస్య మొదలైందని ఆవేదన చెందింది.

తన ఇంటికి పిలిచి `బాగా బరువు పెరుగుతున్నావ్? ఓ సారి షర్ట్ విప్పి పొట్ట చూపించు` అని అడిగాడట. కానీ అందుకు తాను అంగీకరించలేదని.. వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోమని గట్టిగా అరిచానని తెలిపింది. అప్పటి నుంచి దివాకర్ తనకు దూరంగా ఉంటున్నాడని పాయల్ తెలిపింది. ప్రస్తుతం ఈ ఆరోపణలు బాలీవుడ్ సహా టాలీవుడ్ లోనూ ఆసక్తికరంగా మారాయి. తెలుగు బిగ్ బాస్ సీజన్-3పై పలువురు లేడీ కంటెస్టెంట్లు లైంగిక ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే.
Please Read Disclaimer