రణబీర్- అలియా బ్రేకప్.. ఈసారి ఏమైందో?

0

బాలీవుడ్ లో ప్రేమ వ్యవహారాలు నిరంతరం హాట్ టాపిక్. అక్కడ ఆదర్శంగా నిలిచే ప్రేమలు చాలా అరుదు. ప్రేమ..పెళ్లి లాంటి విలువలు అక్కడ అవసరాన్ని బట్టి మారిపోతుంటాయి. కారణాలు అనేకం కావొచ్చు… పాశ్చత్త సంస్కృతి అక్కడి సెలబ్స్ లైఫ్ లో కామన్. టెక్నాలజీతో పాటు వ్యక్తిత్వాలు అంతే వేగంగా అప్ డేట్ అవుతుంటాయి. తాజాగా రణబీర్ కపూర్ -అలియా భట్ జంట గురించిన ఓ షాకింగ్ మ్యాటర్ ఫ్యాన్స్ నమ్మలేనంత షాకింగ్ గా ఉంది.

ఇంతకీ ఆ ఇద్దరి మధ్యా ఏమైంది? అంటే.. ఉన్నట్టుండి బ్రేకప్ అయ్యింది అంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. రణబీర్ – ఆలియా మధ్య మనస్ఫర్థలు తలెత్తాయి. ఇక ఎంతోకాలం ఈ బంధం సాగదు! అన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఇన్నాళ్లు ఆలియాతో చెట్టాపట్టాల్ అంటూ తిరిగేసిన రణబీర్ ఇక తనకు దూరం కానున్నాడన్న వార్త ఆలియా ఫ్యాన్స్ కు షాకిస్తోంది. ఇక రణబీర్ గత హిస్టరీ పరిశీలిస్తే.. తన ఎఫైర్ల గురించి అందరికీ తెలిసిందే. గాళ్స్ తో చెట్టా పట్టాలేసుకుని షికార్లు చేయడం రణబీర్ కు ఓ హాబీ. దీపిక పదుకొణే.. కత్రినా కైఫ్.. ఇలా చాలా మందితో ఎఫైర్లు నెరిపిన సంగతి తెలిసిందే.

దీపిక..కత్రినాలతో పెళ్లి వరకూ వచ్చి వెనక్కి తగ్గాడు. ఇలాంటి కథలు రణబీర్ లైఫ్ లో ఇంకా చాలానే ఉన్నాయి. ఆ బ్రేకప్ లు అన్నింటి తర్వాత రణబీర్ అలియా తో బ్రహ్మాస్త్ర షూటింగ్ సమయంలో లవ్ లో పడ్డాడు. అనంతరం ఈ జంట పెళ్లి చేసుకుని ఒకటి కాబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. ఇరు కుటుంబాల సమక్షంలో రహస్యంగా ఎంగేజ్ మెంట్ కార్యక్రమం పూర్తి చేసినట్లు ప్రచారంలోకి వచ్చింది. ఈ సారి బుద్ధిగా అలియాని పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కావడం ఖాయమనే భావించారంతా. గత అనుభవాల నేపథ్యంలో అలియాని తప్పక కపూర్ ఇంట కోడలిని చేయడం ఖాయమనే బలమైన ప్రచారం సాగింది.

కానీ అదీ మూడునాళ్లు ముచ్చటేనని తాజాగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య మనస్ఫర్ధలు తలెత్తినట్లు చిలవలు పలవులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా అవి నిజమేనని ఓ వేడుక నిరూపించింది. అలియా భట్ పుట్టిన రోజు ఈనెల 15న ఘనంగా జరింది. ఆ వేడుకల్లో రణబీర్ ఎక్కడా కనిపించలేదు. కనీసం విషెస్ కూడా చెప్పినట్లు ఎక్కడా ఆధారాలు దొరకలేదు. ప్రేమలో ఉన్నన్నాళ్లు స్పెషల్ గా సెలబ్రేట్ చేసిన రణబీర్ ఈసారి అస్సలు పట్టించుకున్న పాపాన పోలేదుట. ఇక అలియా కూడా రణబీర్ కు దూరంగానే ఉందని ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. రణబీర్ కుటుంబానికి దూరంగానే ఉంటోందని టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ జంట బ్రేకప్ అయినట్లేనని బాలీవుడ్ లో ప్రచారం ఊపందుకుంది. విడిపోవడానికి కారణాలు అనేకం. ఆ విషయాలు ఆ రెండు హృదయాలకే తెలియాలి. మరి ఇవి నిజమేనని నిరూపిస్తారా? పెళ్లి చేసుకుని ఇలాంటి ప్రచారానికి పుల్ స్టాప్ పెడతారా? అన్నది చూడాలి. ఒకవేళ ఆలియా నుంచి విడిపోతే రణబీర్ ఇక ఎప్పటికీ మారనే మారడు అన్న చెడ్డ పేరు రావడం కూడా ఖాయం.
Please Read Disclaimer