అమలాపాల్ మళ్ళీ పెళ్లి చేసుకుందా…?

0

నాగచైతన్య హీరోగా నటించిన ‘బెజవాడ’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి అమలాపాల్. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా తన నటనతో క్రేజ్ తెచ్చుకుంది. రామ్ చరణ్ తో ‘నాయక్’ – అల్లు అర్జున్ తో ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రాలలో నటించి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. మెగా హీరోలతో నటించినా ఎందుకో కానీ ఇక్కడ చెప్పుకోదగ్గ అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో తమిళ – మళయాల ఇండస్ట్రీలపై దృష్టి పెట్టింది ఈ భామ. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే తమిళ దర్శకుడు విజయ్ ని పెళ్ళి చేసుకుని అందర్ని ఆశ్చర్య పరిచింది. కానీ వీరి బంధం ఎక్కువకాలం నిలబడలేదు. వీరి పెళ్లి మూన్నాళ్ళ ముచ్చటే అయింది. దీని మీద అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద చేర్చే జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజుల గ్యాప్ తీసుకొని తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. వి.ఐ.పి2 – ఆమె చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలు పెద్దగా విజయం సాధించకపోయినా మంచి పేరును తెచ్చి పెట్టాయి.

ఇదిలా ఉండగా అమలాపాల్ మళ్ళీ పెళ్లి చేసుకుందంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన బాయ్ ఫ్రెండ్ భవీంధర్ సింగ్ తో అమలాపాల్ వివాహం జరిగిపోయిందని – పెళ్లి ఫోటోలు ఇవేనంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు దర్శనమిచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉన్నాయి. డైరెక్టర్ విజయ్ తో విడిపోయిన తర్వాత బిజినెస్ మ్యాన్ భవీంధర్ సింగ్ తో రిలేషన్షిప్ లో ఉన్న మాట వాస్తవమే అయినా గత కొన్ని రోజులుగా తన పెళ్లి గురించి అధికారికంగా అమలాపాల్ ప్రకటించిన సందర్భం లేదు. దీనిపై అమలాపాల్ స్పందించే దాకా అమలాపాల్ పెళ్లి విషయంలో క్లారిటీ వచ్చేలా లేదు.
Please Read Disclaimer