తలైవి కోసం తళానే కాదన్నాడు

0

సీనియర్ నటుడు అరవింద స్వామి కి ఉన్న ఇమేజ్ ఎలాంటిదో తెలిసిందే. మణిరత్నం డిస్కవరీ గా ఈ మిస్టర్ పెర్ఫెక్ట్ కి గాళ్స్ లో ఉన్న ఫాలోయింగ్ అసాధారణం. వరుసగా తమిళ బ్లాక్ బస్టర్ల లో నటిస్తూ వేడెక్కిస్తున్నాడు. ఇంతకు ముందు మణిరత్నం నవాబ్ చిత్రంలో రొమాంటిక్ కార్పొరెట్ గురూగా కనిపించి మెప్పించాడు. అధితీరావ్ తో స్వామి రొమాన్స్ కుర్రకారు మర్చిపోలేరు.

రామ్ చరణ్ ధ్రువ సినిమా లో నటించి తెలుగువారికి మరింతగా చేరువయ్యాడు. అరవింద్ స్వామి లాంటి పర్ఫెక్షనిస్ట్ కోసం నిర్మాతలు ఎంత పెద్ద పారితోషికం అయినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. అయితే అతడి కాల్షీట్లు పట్టు కోవడం ఎంత కష్టమో ఇంతకు ముందు ధ్రువ సమయం లో చరణ్ అండ్ టీమ్ కి స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు అదే తరహా అనుభవం తళా అజిత్ టీమ్ కి ఎదురైందట. ప్రస్తుతం తళా అజిత్ హీరోగా హెచ్.వినోద్ దర్శకత్వంలో `వలిమై` అనే భారీ చిత్రాన్ని నిర్మించేందుకు నిర్మాత బోనీ కపూర్ సన్నాహకాల్లో ఉన్నారు. నేర్కొండ పార్వాయ్ (పింక్ రీమేక్) తర్వాత మరో భారీ చిత్రం అజిత్-వినోద్-బోనీ కాంబినేషన్ లో రానుంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ జరుగుతోంది. నటీనటుల ఎంపిక సాగుతోంది. ఇక ఇందులో అజిత్ తో పోటీపడే ఓ కీలక పాత్రకు అరవిందస్వామిని సంప్రదించారు. కానీ ఆ ప్రపోజల్ కి స్వామి తిరస్కరించాడట. కనీసం స్క్రిప్టు కూడా వినకుండానే బోనీ ఆఫర్ ని కాదని అన్నాడట. అయితే అలా ఎందుకు చేశాడు? అంటే..

అమ్మ జయలలిత బయోపిక్ కోసం అరవింద స్వామి బల్క్ గా కాల్షీట్లు కేటాయించాడు. ఆ సినిమా లో లెజెండరీ నటుడు.. నాయకుడు అయిన ఎం.జీ.రామచంద్రన్ పాత్ర లో నటిస్తున్నాడు. దీనిని ఛాలెంజింగ్ గా భావించి ఎంతో కసరత్తు చేస్తున్నాడట. అందుకే బోనీ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాడని తెలుస్తోంది. ఇక అజిత్ – వినోద్ కాంబినేషన్ మూవీకి సంబంధించిన లుక్ ఒకటి ఇంతకు ముందు రివీలైంది. ఇందులో అజిత్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు. పైగా ద్విపాత్రాభినయంతో దుమ్ము రేపనున్నాడట. ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటించనుంది. ఇంతకుముందు న్యూయార్క్ లో బోనీతో నయన్ భేటీ ఆసక్తి ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. నిరవ్ షా ఛాయాగ్రహణం.. యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. డిసెంబర్ లో సినిమా ప్రారంభం కానుంది.
Please Read Disclaimer