కెలికి బండ్ల గణేశ్ ఖరీదైన తప్పు చేశారా?

0

కూర్చొని మాట్లాడుకునే విషయాల్ని వదిలేసి. నువ్వెంత అంటే నువ్వెంత? అన్నట్లుగా మాటా. మాటా అనుకోవటం మొదట్లో బాగానే ఉన్నా. తర్వాతి కాలంలో అప్పటి కాలానికి. పరిస్థితులకు అనుగుణంగా పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. తాజాగా సినీ రంగ ప్రముఖుడు బండ్ల గణేశ్ ఇదే తీరులో ఇబ్బందుల్లోకి వెళ్లిపోనున్నారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ప్రముఖ నిర్మాత కమ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పొట్లూరి వరప్రసాద్ ఇచ్చిన కంప్లైంట్ తో బండ్ల గణేశ్ మీద కేసు నమోదుచేయటం తెలిసిందే. బండ్ల గణేశ్ మీద కేసులు నమోదు కావటం ఇదేమీ తొలిసారి కాదంటున్నారు. గతంలోని కొన్ని కేసులు ఉన్నాయంటున్నారు.

ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఇష్యూలు ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలే కానీ. ఇళ్లపైకి మనుషుల్ని పంపిన వైనాన్నిసినీ రంగ ప్రముఖులు సీరియస్ గా తీసుకున్నట్లుగా చెబుతున్నారు. బండ్ల గణేశ్ తరఫున పీవీపీ ఇంట్లోకి వచ్చిన కిశోర్ అనే వ్యక్తి తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏం చేసుకుంటావో చేసుకోపో. అంటూ వార్నింగ్ ఇచ్చేశారు.

ఇదే విషయాన్ని పీవీపీ పోలీసులకు చెప్పటంతో వారు కేసు బుక్ చేశారు. బండ్ల గణేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నా. అతను దొరకని పరిస్థితి. ఇలాంటివేళ. బండ్ల గణేశ్ ను అదుపులోకి తీసుకోవటానికి పోలీసులు ప్రయత్నించటం.. అంతలోనే టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ వ్యవహారం తెర మీదకు రావటంతో. పోలీసుల ఫోకస్ మారిందంటున్నారు.

ఇటీవల కాలంలో పలు విషయాల్లో బండ్ల గణేశ్ తీరు రచ్చకు కేరాఫ్ అడ్రస్ గా మారిందన్న మాట పోలీసు వర్గాల్లో తరచూ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అతడిపై ఉక్కుపాదం మోపాలన్న మాట పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే. బండ్ల గణేశ్ ఊహించని రీతిలో షాకిచ్చేలా గ్రౌండ్ వర్క్ జరుగుతోందన్న మాట వినిపిస్తోంది. ఇదెంతవరకు నిజమన్నది కాలమే చెప్పాలి.
Please Read Disclaimer