ఇదో లెస్సన్ అని ఫీలవుతున్నారా!

0

ఏదైనా సినిమా కథ వినేప్పుడు ఎంత అందంగా ఉందో తెరకెక్కించాక అంతే గొప్పగా కుదరకపోతే .. ఫీల్ మిస్సయితే ఆ పర్యవసానం ఎలా ఉంటుందో రాజ్ తరుణ్ – దిల్ రాజు బృందానికి పక్కాగానే అర్థమై ఉంటుంది. ఇండస్ట్రీ బెస్ట్ జడ్జిమెంట్ ఉన్న నిర్మాతగా దిల్ రాజునే తడబడ్డారంటే.. సామాన్యుల పరిస్థితేమిటో అని ఆలోచించాల్సిన పరిస్థితి. ఇదంతా దేనిగురించి అంటే.. రాజ్ తరుణ్ నటించిన ఇద్దరి లోకం ఒకటే సినిమా గురించే. ఇటీవలే థియేటర్లలోకి రిలీజైన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచిందన్న టాక్ వచ్చింది.

ఇద్దరి లోకం ఒకటే అనే క్లాసిక్ టైటిల్ ని పెట్టుకున్నా ప్రథమార్థం చూసినప్పుడే ఆ సినిమాపై సందేహం కలిగిందిట రాజుగారికి. అంటే ఈ సినిమా ఫ్లాపవుతుందని రాజుగారికి ముందే తెలుసన్నమాట. ఇక ఫైనల్ వెర్షన్ చూశాక మాత్రం ఓకే మూవీ అని అనుకున్నా ఇప్పుడు ఆ రిజల్ట్ కూడా రాలేదు. ఇదో డిజాస్టర్ అని ఆడియెన్ తేల్చేశారు. ఇక క్రిటిక్స్ అయితే మరీ దారుణమైన రేటింగులతో చీవాట్లు పెట్టారు. ఔట్ డేటెడ్ లైన్ తో చెత్తగా తీశారని విమర్శించారు. అయితే ఒక ఇలాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ఎంచుకుంటే ఆడియెన్ లో ఎమోషన్ ని రగిలించేలా ఉండాలి. ప్రతి మలుపులో పెయిన్ కనిపించాలి. లవ్ .. రొమాన్స్ పరాకాష్టలో వర్కవుట్ చేయగలగాలి. మణిరత్నం గీతాంజలి రేంజులో తీస్తేనే వర్కవుట్ అవుతుంది తప్ప నాశిరకంగా తీస్తామంటే కుదరదు. అందుకే ఇద్దరి లోకం ఒకటే ఓలెస్సన్ అని ఫీలవుతున్నారంతా.

అయితే ఇవన్నీ తెలియక రాజుగారు తప్పు చేశారా? అంటే ఆయన ఈ మూవీని అస్సలు పట్టించుకోలేదనే అర్థమవుతోంది. ఇక ఏడాదికి అరడజను సినిమాల్ని నిర్మించాలన్న టెన్షన్ ఆయనకు ఉంటుంది కాబట్టి రాజ్ తరుణ్ కి ఏ సాయం చేయలేకపోయారని భావించాలేమో! వరుసగా లవర్ తర్వాత ఇద్దరి లోకం ఒకటే చిత్రంతో రెండో ఫ్లాప్ ఎదుర్కోవాల్సి వచ్చింది అందుకే.
Please Read Disclaimer