మెగా పవర్ స్టార్ అంత రిస్క్ చేస్తాడా?

0

RRR తర్వాత రామ్ చరణ్ నటించే సినిమా ఏది? దర్శకుడు ఎవరు? అంటే అందుకు ఇంతవరకూ సరైన సమాధానం లేదు. చెర్రీతో సినిమాలు చేయాలని త్రివిక్రమ్.. కొరటాల సహా పలువురు సీనియర్ దర్శకులు వేచి చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు టాప్ డైరెక్టర్లు స్క్రిప్టులు వినిపించి రెడీగా ఉన్నారు. కానీ చరణ్ ఇంకా ఏ ఒక్కరికీ కాల్షీట్లు కేటాయించలేదు. ప్రస్తుతం ఆయన ఆర్.ఆర్.ఆర్ పైనే ఏకాగ్రత పెట్టాడు. ఈ నేపథ్యంలో తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్.కె. కుమార్ చరణ్ ని కలిసి ఓ స్క్రిప్ట్ వినిపించాడని ప్రచారమవుతోంది. కానీ చరణ్ ఓకే చేశారా లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

మరి విక్రమ్ కె. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మెగా పవర్ స్టార్ అవకాశం ఇస్తాడా? అన్నది చూడాలి. ఇటీవలే నేచురల్ స్టార్ నానితో ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ తెరకెక్కించాడు విక్రమ్. కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. అటు బన్నీ కూడా ‘నా పేరు సూర్య’ తర్వాత విక్రమ్.కెతో సినిమా చేయాలనుకున్నా.. కమర్శియల్ డైరెక్టర్ కాదని భావించి చివరి నిమిషంలో వెనకడుగు వేసాడు. మరి ఇన్ని కారణాల నడుమ చరణ్ రిస్క్ తీసుకుంటాడా? అన్నది సందేహమే. వీటిపై క్లారిటీ రావాలంటే మరికొంత కాలం వేచి చూడాలి.

ఇకపోతే రామ్ చరణ్ త్రివిక్రమ్-కొరటాలతో పాటు సుకుమార్ తోనూ పని చేసేందుకు ఆస్కారం ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల ఆ ముగ్గురు దర్శకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విక్రమ్.కె కి అవకాశం ఉంటుందా లేదా? అన్నది స్క్రిప్టునే డిసైడ్ చేస్తుంది.
Please Read Disclaimer