రామ్ మాస్ బ్యాచ్ లో చేరినట్టేనా ?

0

ఇప్పటిదాకా క్యూట్ లవర్ బాయ్ సాఫ్ట్ రోల్స్ చేస్తూ వచ్చిన రామ్ కు ఇస్మార్ట్ శంకర్ ఊహించని విధంగా కొత్త బ్రేక్ ఇచ్చింది. నిజానికి రామ్ కు మాస్ జానర్ లో హిట్టు కొట్టాలని ఎప్పటి నుంచో ఉంది. అందులో భాగంగానే కథలో అవసరం ఉన్నా లేకపోయినా మసాలా అంశాలు జోడించిన శివమ్-హైపర్ లాంటి సినిమాలు చేశాడు. కానీ ఆవి ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో మళ్ళీ ప్రేమ కథల వైపే టర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ గోల్ రీచ్ అయ్యేలా చేసింది.

మాస్ కి కిక్కిచ్చే హీరోయిజం రామ్ మీద కూడా పండుతుందని పూరి ఋజువు చేయడంతో రామ్ కోసం కథలు రాసే రచయితలు దర్శకులు ఆ కోణంలో ఆలోచించే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఓకే అయిన కిషోర్ తిరుమల ప్రాజెక్ట్ స్క్రిప్ట్ లో దానికి తగ్గట్టే ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా అనే అనుమానం అప్పుడే మొదలైంది. రామ్ విదేశాల నుంచి తిరిగి వచ్చి చెబితే గాని క్లారిటీ రాదు

కానీ ఒక్క హిట్టుకే పూర్తి మాస్ స్టార్ కావడం అంత ఈజీ కాదు. ఇంకో రెండు మూడు సాలిడ్ బ్లాక్ బస్టర్స్ పడితే అప్పుడు మార్కెట్ పెరిగి ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు ఆశించాలో అన్న అంచనాకు వచ్చి దానికి తగ్గట్టే హీరో ఇమేజ్ ని ఫిక్స్ చేస్తారు. అలా అన్ని ఇస్మార్ట్ శంకర్ టైపు కథలే చేస్తే తేడా కొట్టే ప్రమాదమూ లేకపోలేదు.

ఇస్మార్ట్ శంకర్ కు ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉన్నారు. వాళ్ళు సైతం రావాలి అంటే మహేష్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లాంటి హీరోలు చేసే సబ్జక్ట్స్ ట్రై చేయాలి. కానీ వీటికి దర్శకుల సెలక్షన్ చాలా ముఖ్యం. అసలే ఫామ్ లో ఉన్న దర్శకులను మన స్టార్ హీరోలు ఏళ్లకేళ్లు లాక్ చేసుకుని పెట్టేసుకుంటున్నారు. అందుకే రామ్ ఇకపై చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి వచ్చేలా ఉంది
Please Read Disclaimer