హిట్టు వచ్చింది.. ఫీజు పెరిగింది!

0

సమంతా అక్కినేని గత కొంత కాలంగా తన సినిమాల ఎంపికలో పూర్తి వైవిధ్యం చూపిస్తున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ సినిమాలు కాకుండా డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాల్లో నటిస్తూ అందరినీ మెప్పిస్తోంది. రీసెంట్ గా సమంతా ‘ఓ బేబీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు యావరేజ్ రివ్యూసే వచ్చినా అందులో సమంతా నటనకు మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉంటే ‘ఓ బేబీ’ సినిమా విజయంతో సమంతా తన రెమ్యూనరేషన్ ను పెంచిందని సమాచారం. గతంలో సమంతా ఒక సినిమాకు రూ. 2 కోట్లు ఛార్జ్ చేసేదట. అయితే ఇప్పుడు ఒక కోటి రూపాయలు పెంచి రూ.3 కోట్లుగా ఫిక్స్ చేసిందట. ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసే హీరోయిన్లు సౌత్ లో ఒకరిద్దరి కంటే ఎక్కువ ఉండరు. సౌత్ లో హయ్యెస్ట్ ఫీజు తీసుకునే హీరోయిన్ నయనతార. ఆమె ఒక సినిమాకు దాదాపు రూ. 5 కోట్లు తీసుకుంటుందట. నయన్ తర్వాత ఈ లిస్టులో ఇప్పటివరకూ అనుష్క ఉండేదని టాక్ ఉంది. మరి ఇప్పుడు సమంతా ఫీజు పెంచడంతో దాదాపు అనుష్క రెమ్యూనరేషన్ కు సమానం అని అంటున్నారు.

సమంతా ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ ’96’ సినిమాకు తెలుగు రీమేక్ లో నటిస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా కాకుండా మామగారు నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న ‘మన్మథుడు 2’ లో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తోంది.
Please Read Disclaimer