శృతిహాసన్ మళ్లీ ప్రేమలో పడిందా.. ఎవరతను?

0

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో శ్రుతిహాసన్ ఒకరు. ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తొలినాళ్లలో సక్సెస్ కోసం ఇబ్బంది పడింది. ఆ తర్వాత తెలుగు తమిళ్ ఇండస్ట్రీల్లో సత్తా చాటింది. ఇటీవల విడుదలైన ‘క్రాక్’ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. కోలీవుడ్లో విజయ్ సేతుపతి సరసన చేసిన చిత్రం త్వరలో రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ఇన్ స్టా గ్రామ్ వేదికగా.. ఇంటరాక్ట్ అయ్యింది శృతి. ఈ సందర్భంగా తన జీవితం కెరీర్ ప్రేమ విషయాలపై ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు స్పందించిన శృతి.. మళ్లీ తాను ప్రేమలో ఉన్నానంటూ హింట్ ఇచ్చింది.

ఫ్యాన్స్ తో జరిగిన ఇంటరాక్షన్లో.. ‘ట్రూ ఆర్ ఫాల్స్’ సెక్షన్ నడిపింది శృతి. ఈ సందర్భంగా అభిమానులు ఆమె జీవితానికి సంబంధించిన చాలా ప్రశ్నలు అడిగారు. వారిలో ఒక అభిమాని శృతి ప్రేమ గురించి ఆరాతీశారు. ‘మీరు ప్రేమలో ఉన్నారా?’ అంటూ అడిగిన ప్రశ్నకు ‘ట్రూ.. ఐ గెస్’ అని చెప్పింది శృతి. దీంతో.. ఆ ప్రేమికుడు ఎవరా? అనే చర్చ మొదలైంది.

కాగా.. శ్రుతి హాసన్ గతంలో ఇటాలియన్ సంగీతకారుడు మైఖేల్ కోర్సలేతో రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. కొంత కాలం క్రితం కమల్ హాసన్ ను కలవడానికి అతను ఇండియా కూడా వచ్చాడు. అయితే.. కారణమేంటో తెలియదు కానీ.. వీరిద్దరూ విడిపోయారు.

మైఖేల్ తో విడిపోయిన తర్వాత.. శృతి తన ప్రేమ గురించి మాట్లాడడం ఇదే మొదటి సారి. ఈ నేపథ్యంలో శృతి లవర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంటుందా? అని చర్చిస్తున్నారు ఫ్యాన్స్. కాగా.. మరో అభిమాని తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి ఓ ప్రశ్న వేశారు. మీ మాజీ ప్రియుడిని ద్వేషిస్తున్నారా? అని అడగ్గా.. చిన్న స్మైల్ ఇచ్చిన శృతి.. ‘కాదు’ అని చెప్పింది. మరి ఇంతకీ.. శృతి ఎవరితో ప్రేమలో పడి ఉంటుంది?