విశాల్ మ్యారేజ్.. మరో ట్విస్ట్ ఇచ్చిన అనీష!

0

కోలీవుడ్ హీరో విశాల్ – అనీషా రెడ్డి నిశ్చితార్థం జరిగి చాలారోజులయింది. అక్టోబర్లో వివాహం చేసేందుకు ఇరుకుటుంబాల పెద్దలు నిర్ణయించారు. అయితే రీసెంట్ గా జరిగిన పరిణామాలు ఒక్కసారిగా అందరికీ షాకిచ్చాయి. ఒకవైపు అనీష తన సోషల్ మీడియా ఖాతాల నుండి ఎంగేజ్మెంట్ ఫోటోలను డిలీట్ చేసింది. మరోవైపు విశాల్ కూడా పిన్ చేసి పెట్టిన పోస్ట్ ను డిలీట్ చేశాడు. సహజంగా సోషల్ మీడియాలో ఇలా ఫోటోలను డిలీట్ చేశారంటే బ్రేకప్ అయిందని అర్థం చేసుకుంటారు. తాజాగా ఇల్లీ-ఆండ్రూ బ్రేకప్ విషయం ఇలానే బైట పడిందని ఇట్టాంటి న్యూసులను ఎంతో శ్రద్ధగా ఫాలో అయ్యే విజ్ఞులకు తెలుసు!

అయితే విశాల్ – అనీషాల వివాహం రద్దయిందని అటు కోలీవుడ్ నుండి టాలీవుడ్ వరకూ కథనాలు వస్తున్నప్పటికీ ఇప్పటివరకూ ఇద్దరూ స్పందించలేదు.. ఆ వార్తలను ఖండించనూలేదు. ఇక బ్రేకప్ ఖాయమేనని అందరూ ఫిక్స్ అయిపోయిన సమయంలో తాజాగా అనీషా అందరికీ ఓ పెద్ద ట్విస్ట్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. విశాల్ కు అనీషా ఒక అందమైన బర్త్ డే మెసేజ్ పెట్టిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇంగ్లీష్ లో పెట్టిన ఆ మెసేజ్ ను అనువాదం చేస్తే “హ్యాపీ బర్త్ డే స్టార్..నువ్వు వెలగడానికే జన్మించావు. నీలోని అందాన్ని.. నీతో ఉండడాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తాను. నీ దిశగా గొప్పదనం రాబోతోంది. నాకు నమ్మకం ఉంది. #లవ్ ఆల్వేస్” అంటూ ఫోటోపై ఒక క్యాప్షన్ ఇచ్చింది. ఇది హాలీవుడ్ సినిమాలకు నాసిరకం తెలుగు అనువాదంలా అనిపిస్తే దయచేసి క్షమించండి.. ఇన్నర్ మీనింగ్ మాత్రం అర్థం చేసుకోండి చాలు..!

ఇప్పుడు ఈ ఫోటో.. ఫోటోపైన చెక్కిన డిజిటల్ సందేశానికి అర్థం ఏంటి? అనీషా – విశాల్ పెళ్ళి యధావిధిగా జరుగుతుందనేనా? మరి ఈ విషయంపై క్లారిటీ రావాలంటే విశాల్ – అనీషా ల నుంచి రెస్పాన్స్ వచ్చేవరకూ వేచి చూడక తప్పదు. అయితే ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ ఫోటో ఇప్పుడు అనీష ఇన్స్టా లో కనిపించడం లేదు! మరి ఈ ఫోటో నిజంగానే అనీష షేర్ చేసిందా లేక ఎవరైనా అల్లరి నెటిజన్ల చేసిన పనా?Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home