మిస్ ఇండియా 2018 లింగమార్పిడి?

0

ఫెమినా మిస్ ఇండియా 2018 కిరీటధారి అనుక్రీతి వాస్ సాహసాల గురించి ఏమని చెప్పాలి. తమిళనాడుకు చెందిన కాలేజ్ విద్యార్థి అయిన అనుక్రీతి వాస్ తిరుచ్చిలో పుట్టి పెరిగింది. తనను ఓ ఒంటరి తల్లి పెంచి పెద్దది చేశారు. తన లైఫ్ లో అది సవాల్ లా అనిపించిందని అనుకృతి చెబుతోంది. పరిస్థితిలే తమను బలంగా ఉండటం నేర్పించాయని అంటోంది. తాజా ఇంటర్వ్యూ లో అనుకృతి పలు ఆసక్తికర సంగతుల్ని వెల్లడించింది.

ఇక అనుకృతి వాస్.. లింగమార్పిడి విద్య కోసం పని చేశారన్న సంగతి మీకు తెలుసా? ఉన్నత విద్యాధికురాలిగా తనవంతు బాధ్యతను అనుకృతి నెరవేర్చింది. నేను లింగమార్పిడి విద్య కోసం పని చేస్తున్నాను. నాకు పాఠశాలలో ఒక లింగమార్పిడి స్నేహితుడు ఉన్నాడు. అతని కుటుంబం తనను విడిచిపెట్టింది … నేను 2015 లో ఒక ఎన్జీఓలో చేరాను. అక్కడ ప్రధానమైన వృత్తి లింగమార్పిడి పిల్లల విద్య. ఇప్పటివరకు మేము 30 మంది లింగ మార్పిడిదారులను దత్తత తీసుకుని వారికి విద్యను అందిస్తున్నాము“ అని వెల్లడించింది.

ఇక అందాల పోటీలో.. అనుక్రీతి వాస్ మిస్ బ్యూటిఫుల్ స్మైల్ కిరీటం తో పాటు బ్యూటీ విత్ పర్పస్ అవార్డును గెలుచుకున్నారు. తన చిరునవ్వు తనకు బలం. తల్లి నుండి నేర్చుకున్న గుణం వల్లనా ఒంటరిగా పెరగడం సమస్యలతో పోరాడటం నేర్పింది. ఇక అనుకృతి అందచందాలు చూశాక బాలీవుడ్ లో కథానాయిక అవుతుందని అంతా భావించారు. కానీ తాను సోషల్ వర్క్ వైపే దృష్టి సారించారు.

“ పాఠశాల దశ నుంచే సవాళ్లు మొదలవుతాయి. నేను చదువుకున్న తిరుచ్చి (తిరుచిరాప్పల్లి) ఓ చిన్న పట్టణం మాత్రమే. అక్కడే చదువుకున్నాను. కానీ నేను చాలా బలమైన మహిళగా ఎదిగానంటే.. నా తల్లి నన్ను అలా పెంచారు. తను నన్ను ఏ సమయంలోనూ నిరాశపరచలేదు“ అని తెలిపింది. అమ్మ కష్టాల్ని నేను ఎన్నడూ చూడలేదు. ఆమె తన జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంది. కానీ ఏదీ నాకు ఎప్పుడూ చూపించలేదు“ అని ఆమె చెప్పింది.

అనుక్రీతి తనను తాను టామ్బాయ్ అని పిలుచుకుంటుందట. బైక్ నడపడాన్ని అమితంగా ఇష్టపడుతుంది. కానీ అంతకు మించి లింగమార్పిడి చేసేవారికి అవగాహన కల్పించడంలో చురుకుగా పాల్గొంటుంది… ఈ ధైర్యం తనకు మాత్రమే ఉంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-