విజయ్ దేవరకొండ – నానీల మధ్య తేడా అదేనా..?

0

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించడం చాలా కష్టం. ఒక హీరో నుండి విజయవంతమైన చిత్రాలు వచ్చినప్పుడు ఆ హీరో స్టార్ డమ్ పొందుతాడు. కానీ ఆ స్టార్డమ్ కొనసాగించిన వారు మాత్రమే ఇండస్ట్రీలో మనుగడ సాధించగలరు. ఇది సినీ పరిశ్రమలో అందరికి తెలిసిన విషయమే. కొంతమంది తమ అరంగేట్రంలో బ్లాక్ బస్టర్స్ సాధించి తరువాత రోజుల్లో సినీ పరిశ్రమ నుండి అదృశ్యమైన హీరో హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. అలాంటి వారు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వడం మరింత కష్టం. ఇలాంటి నేపథ్యంలో ఎలాంటి గాడ్ ఫాదర్ సహాయం లేకుండా సక్సెస్ అయిన ఈ జెనరేషన్ హీరోలో నాని ఒకరు. నాని తన సహజమైన నటనతో మెప్పించడమే కాకుండా విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటూ వైవిధ్యమైన చిత్రాలలో భాగస్వామి అవ్వడమే దీనికి కారణం. అందుకే అభిమానులు ఇతనిని నాచురల్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. నానితో పోలిస్తే ఇతర యువ హీరోలు ఈ అంశంలోనే తడబడుతున్నారు. నాని ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నటించిన ‘వి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

మరోవైపు ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా పరిచయమైన విజయ దేవరకొండ కూడా ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వాడే. తొలి సినిమాతోనే హిట్ కొట్టిన విజయ్ తర్వాత నటించిన ‘అర్జున్ రెడ్డి’ – ‘గీత గోవిందం’ వంటి చిత్రాల విజయాలతో స్టార్ డమ్ సాధించాడు. పరిచయమైన కొద్దికాలంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండను చూసి తర్వాత రోజుల్లో నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంటాడని అందరు భావించారు. కానీ విజయ్ అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ నుండి బయటకి రాలేకపోవడం సరైన ప్లానింగ్ లేకపోవడం వలన అతను వెనకపడ్డాడు. అంతేకాకుండా అతని దూకుడు వైఖరి అతని మైనస్ పాయింట్ గా మారుతోంది. ఈ మధ్య రిలీజైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం ద్వారా రేస్ లో బాగా వెనకబడిపోయిన విజయ్ దరింగ్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ చిత్రంలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-