‘మా’ లో సినిమాని కొట్టేసే రసవత్తర నాటకం

0

`మా` అసోసియేషన్ లో అసలు వీధినాటకం రసపట్టుకు చేరింది. కొత్త కమిటీ ఎన్నికై ప్రమాణ స్వీకారాల రోజునే గొడవల లొల్లి బయటపడింది. కొత్త అధ్యక్షుడిపై ఉపాధ్యక్షులు- ఈసీ సభ్యులు సహా అంతా విరుచుకుపడడం డైరెక్టుగా లైవ్ లోనే చూశారు జనం. తాజాగా గత వారం రోజులుగా మాలో జరుగుతున్న పరిణామాలపై ప్రముఖంగా చర్చ సాగుతోంది. ఉన్నట్టుండి కొత్త అధ్యక్షుడిపై కమిటీ తిరుగుబావుటా వేడెక్కిస్తోంది

ఆరు నెలలు కూడా పూర్తి కాకుండానే `మా` అసోసియేషన్ సభ్యుల్లో లుకలుకలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. `మా` అధ్యక్షుడు శివాజీ రాజాను మరో సారి గద్దెనెక్కించ కూడదని కంకణం కట్టుకున్న నరేష్ తన ప్లాన్ ప్రకారం ఎత్తులు వేసి `మా` అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకున్నా దానిని నిలబెట్టుకోవడంలో తడబడుతుండడం బయటపడింది. అయితే నరేష్ `మా` అధ్యక్షుడు కావడం సభ్యుల్లో ఎవరికీ ఇష్టం లేదన్నది బహిరంగ రహస్యం. ప్రతిదాంట్లో `నా` అనే బిహేవియర్ కారణంగా హేమ లాంటి వాళ్లు బాహాటంగానే నరేష్ పై విమర్శలు గుప్పించారు. తాజాగా ఏ.లక్ష్మీనారాయణ అనే వ్యక్తి మా సభ్యులపై సివిల్ కోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది.

ఇటీవల `మా` అధ్యక్షుడు నరేష్ కు వ్యతిరేకంగా సభ్యుల్ని సమీకరించి ఉపాధ్యక్షుడు రాజశేఖర్- జీవిత తదితరులు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్ లో చర్చించిన అంశాల్ని బహిర్గతం చేయకుండా కీలక సభ్యులు జాప్యం చేస్తున్నారని లక్ష్మీనారాయణ అనే వ్యక్తి సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీంతో `మా` అసోసియేషన్ కు సివిల్ కోర్టు నోటీసుల్ని పంపించడం కలకలం రేపుతోంది. ఇంతకీ లక్ష్మీనారాయణ ఎవరు?. అతనికి ఉన్న హోదా ఏంటీ? అన్నది మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు. మరి దీనిపై `మా` కీలక సభ్యులు ఏమని వివరణ ఇస్తారో చూడాలి. అసలింతకీ ఎవరీ లక్ష్మీ నారాయణ? ఆయన వెనక ఉన్న షాడో ఎవరు? అంటూ ఆర్టిస్టుల్లో వాడి వేడిగా చర్చ సాగుతోంది.




Please Read Disclaimer