బిగ్ బాస్ ని డిగ్ చేస్తున్న న్యూ బాస్

0

నిన్న స్టార్ మా ఛానల్ లో అట్టహాసంగా మొదలైన బిగ్ బాస్ 3 మీద నెటిజెన్ల కన్ను భారీగా ఉంది. గత ఏడాది రెండో సీజన్ చేసినప్పుడు నాని దీని దెబ్బకే కాస్త షేక్ అయ్యాడు కూడా. ఇక ఆర్మీ పేరుతో పార్టిసిపెంట్ల తరఫున జరిగిన రచ్చ గుర్తుందిగా. ఈసారి కూడా అంతకు మించి అనే తరహాలో చాలా స్పెషల్స్ ఉంటాయని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ కు పేరడీలు స్పూఫ్ లు మొదలైపోయాయి. అందులో భాగంగా వస్తోందే డిగ్ బాస్ 3.0. అలా అని ఇదేదో ఆషామాషీగా ఓ రెండు మూడు నిముషాలకు పరిమితం చేసేది కాదండోయ్. ఓ యుట్యూబ్ ఛానల్ ఏకంగా ఫుల్ టైం షో తరహాలో డిగ్ బాస్ 3.0 అనే వెరైటీ ప్రొగ్రామ్ ని రూపొందించింది. దీని తాలూకు ట్రైలర్ ప్రోమో ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది

ఇందులో విశేషం ఏంటంటే అచ్చం నాగార్జుననే పోలి ఉన్న వ్యక్తిని యాంకర్ గా తీసుకొచ్చారు. డూప్ అంటారే అదే తరహాలో. మిమిక్రీతో వాయిస్ ని కూడా ఇమిటేట్ చేస్తున్నాడు. అంతేకాదు టాలీవుడ్ సెలబ్రిటీలను పోలిన వాళ్ళను పార్టిసిపెంట్స్ గా దించేశారు. విజయ్ దేవరకొండ – శ్రీముఖి – ప్రభాస్ – కేఏపాల్ – రాజ్ తరుణ్ – రేణు దేశాయ్ – పోసాని – సునీల్ లాంటి సెలెబ్రిటీల పోలికలు బాడీ మ్యానరిజమ్స్ ఉన్న వాళ్ళతో పాటు టిక్ టాక్ లో పాపులర్ అయిన ఉప్పల్ బాలుని కూడా ఇందులో తీసుకొచ్చారు.

ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తరహాలో రూపొందించిన ఈ స్పూప్ వీడియో తాలూకు ట్రైలరే ఇలా ఉంటే ఇక ఫుల్ షోలో ఏ రేంజ్ లో కామెడీ ఉంటుందో అన్న అంచనాలు కలగడం సహజం. మరి ఈ డిగ్ బాస్ ఏ రేంజ్ లో వినోదాన్ని పంచుతాడో చూడాలి. వరస చూస్తే షో బయట కూడా ఇలాంటి డిగ్ బాసులు బాగానే రచ్చ చేసేలా ఉన్నాయి
Please Read Disclaimer