డిజిటల్ ముప్పు ఇలా కూడా ముంచుతోందా!

0

ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాని .. థియేటర్లలో రిలీజ్ చేస్తే చూడాలా వద్దా? ఆన్ లైన్ లో హెచ్ డీ క్వాలిటీతో పైరసీ లింక్ అందుబాటు లో ఉంటే ఆ సినిమాని థియేటర్లకు వెళ్లి చూడాలా వద్దా? డిసైడ్ యువర్ సెల్ఫ్…

అసలింతకీ ఏంటి కథ? అంటే.. పైరసీ మాఫియా ఇండస్ట్రీ ని చప్పరించేస్తున్న ఈ బ్యాడ్ టైమ్ లో దీనికి అదనంగా డిజిటల్ స్ట్రీమింగ్ ఊపందుకోవడం సినిమాకి సంకటంగా మారిందని తాజా సీన్ చెబుతోంది. ఇంకా బతికుండగానే బలి కృతువులా మారింది సన్నివేశం. అయితే ఇది నిర్మాతలకు అంత పెద్ద పంచ్ వేయకపోయినా పంపిణీదారులు.. బయ్యర్లకు మాత్రం అశనిపాతంలా మారుతోందన్న విమర్శలొస్తున్నాయి.

జనవరి 1న తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన `తూటా` థియేటర్లలో రిలీజైంది. అయితే అప్పటికే ఈ సినిమా మాతృక వెర్షన్ అయిన `ఎన్నయ్ నోకి పాయుం తోట` అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. జనవరి 3 నుంచే తమిళ వెర్షన్ అందుబాటులోకి రావడంతో అందరూ డిజిటల్లోనే చూస్తున్నారు.

తెలుగు అనువాదం థియేటర్లలో రిలీజైన రెండో రోజే అమెజాన్ లో తమిళ వెర్షన్ అందుబాటు లో ఉంది . మరి ఇలాంటప్పుడు తెలుగు వెర్షన్ చూడాలా వద్దా? ఇప్పటికే పైరసీలోనూ మాంచి హెచ్.డి క్వాలిటీతో తమిళ వెర్షన్ ని అందించారు. తమిళ్ రాకర్స్ సైట్లోనూ ఇది అందుబాటులో ఉంది. ఇలాంటి పరిస్థితి ఉంటే తెలుగులో అనువాదాలు ఆడతాయా? అసలే టెక్నాలజీపై పల్లె పల్లెనా అవగాహన పెరిగింది. స్మార్ట్ యుగంలో ప్రతిదీ అందుబాటులో ఉన్నాయి. అలాంటప్పుడు థియేటర్ల వరకూ వచ్చి చూసేవాళ్లు ఉంటారా? అందుకే తూటాపై ఆ ప్రభావం పడిందని చెప్పాలి. ఇలానే ప్రతి సినిమా విషయంలో జరిగితే థియేటర్లకు వచ్చేది ఎవరు?అందువల్లనే తెలుగు అనువాదాలకు సరైన బయ్యర్ ఉండరనే భావించాల్సి వస్తోంది.
Please Read Disclaimer