ప్రపంచ రికార్డులు క్రియేట్ చేస్తున్న సుశాంత్ చివరి సినిమా ట్రైలర్!!

0

బాలీవుడ్ దివంగత యువ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ నటించిన ఆఖరి సినిమా దిల్ బేచారా. ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇటీవలే విడుదల చేసిన ఈ ట్రైలర్ 69 లక్షలకు పైగా వ్యూస్.. 10 మిలియన్ల పైగా లైక్స్ సొంతం చేసుకొని వరల్డ్ రికార్డు బద్దలు కొట్టింది. ఇక ట్రైలర్ చూసిన వారందరు సుశాంత్ లైఫ్ గురించి కాస్త ఎమోషనల్ అవుతున్నారట. ట్రైలర్ లో సుశాంత్ పలికే ప్రతీ డైలాగ్ సినీప్రియుల హృదయాలను తాకుతోందని అంటున్నారు. అందులో “ఎలా పుట్టాలి.. ఎప్పుడు చావాలి అనేది మనం డిసైడ్ చేయలేం.. కానీ ఎలా బతకాలన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంది” అంటూ వినిపిస్తున్న సుశాంత్ డైలాగ్ అభిమానులను కంటతడి పెట్టిస్తోంది. సుశాంత్ సరసన సంజన సంఘీ కథానాయికగా ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది.

ట్రైలర్ చూసిన వారందరికీ ఈ సినిమాలో హీరోయిన్కు క్యాన్సర్ ఉంటుందని అర్ధమవుతుంది. ఆమెను కలిసిన హీరో ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ప్రియురాలి కోరికలన్నీ ఒక్కొక్కటిగా తీరుస్తుంటాడు. ఎంతో ఎమోషనల్ నేపథ్యం ఉన్న ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్రయూనిట్ ఆకాంక్షిస్తున్నారు. హాలీవుడ్ ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ సినిమాకు రీమేక్గా రూపొందించారు. ఈ సినిమాతో ముఖేష్ ఛాబ్రా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అయితే అంతా బాగానే ఉన్నా అసలు హీరో సుశాంత్ మన మధ్య లేడని చిత్రబృందంతో పాటు దేశవ్యాప్తంగా అభిమానులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా జూలై 24న డిస్నీ హాట్స్టార్లో విడుదల కానుంది. అయతే ఎలాంటి సబ్స్క్రిప్షన్ చార్జీలు లేకుండా ఉచితంగా అందరికి అందుబాటులో ఉండనుంది.