సురేష్ బాబు దారిలో దిల్ రాజు

0

టాలీవుడ్ లో బడా నిర్మాతల్లో సురేష్ బాబు ఒకరు. తండ్రి నుండి సినిమా నిర్మాణ భాద్యతలు తీసుకున్న సురేష్ బాబు ఒక వైపు సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు చిన్న సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. చేతిలో థియేటర్స్ ఉండటంతో ఎప్పటికప్పుడు చిన్న సినిమాలను సమర్పిస్తూ రిలీజ్ చేస్తాడు.

ఇప్పుడు మరో బడా నిర్మాత దిల్ రాజు కూడా అదే దారిలో వెళ్తున్నాడు. అప్పుడప్పుడు కొన్ని అడపాదడపా సినిమాలను రిలీజ్ చేసే దిల్ రాజు ప్రస్తుతం వరుసగా చిన్న సినిమాలను సపోర్ట్ చేస్తూ రిలీజ్ కి దారి చూపిస్తున్నాడు. ఇటీవలే రాకేష్ హీరోగా నటించి నిర్మించిన ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ సినిమాను సమర్పిస్తూ రిలీజ్ చేసిన దిల్ రాజు రవిబాబు ‘ఆవిరి’ సినిమాకు కూడా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.

తాజాగా మరో సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. బిత్తిరి సత్తి హీరోగా నటించిన ‘తుపాకీ రాముడు’ సినిమా దిల్ రాజు ప్రెజెంట్స్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి డేట్ తో ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ మీద రాజు గారి పేరు చూసి అందరూ షాకవుతున్నారు. అక్టోబర్ 25న రిలీజ్ అవుతున్న ఈ చిన్న సినిమా ఎట్టకేలకు రాజు గారి రిలీజ్ ఖాతాలో చేరింది.
Please Read Disclaimer