శేష్ కు ఆఫర్ ఇచ్చిన రాజుగారు!

0

వెంకట్ రాంజీ దర్శకత్వంలో అడివి శేష్.. రెజీనా.. నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎవరు’ ఈ గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుండి పాజిటివ్ మౌత్ టాక్.. క్రిటిక్స్ నుండి కూడా పాజిటివ్ రివ్యూస్ అందుకోవడంతో ‘ఎవరు’ టీమ్ సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు. తాజాగా ‘ఎవరు’ టీమ్ ఒక సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ సక్సెస్ మీట్ కు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు హాజరయ్యారు. ‘ఎవరు’ చిత్రాన్ని రాజుగారు నైజామ్ ఏరియాలో పంపిణీ చేస్తున్నారు. అందుకే అయన ఎంతో ఉత్సాహంగా సినిమా పై ప్రశంశల జల్లు కురిపించారు. ‘ఎవరు’ చిత్రాన్ని రిలీజ్ కు ముందు రోజు ప్రసాద్స్ ఐమాక్స్ లో చూశానని.. పాటలు లేకుండా ఫైట్స్ లేకుండా అంత సేపు ఆడియన్స్ ను సీట్స్ లో కూర్చోబెట్టడం కష్టమని.. అలాంటి పనిని వెంకట్ రాంజీ టీమ్ చేసి చూపించారని అన్నారు. డైరెక్టర్ రాంజీ రెజీనా లోని టాలెంట్ ను ఫుల్ గా వాడుకున్నాడని.. ప్రతి సీన్ లో తనకు కావాల్సిన ఎక్స్ ప్రెషన్స్ రాబట్టుకున్నాడని మెచ్చుకున్నారు.

హీరో శేష్ ను మెచ్చుకుంటూ “చాలామంది మాకు బ్యాక్ గ్రౌండ్ లేదని.. మమ్మల్ని ఎవరు చూస్తారు అంటూ ఉంటారు. అలాంటివారికి శేష్ మంచి ప్రేరణ.. మన దగ్గర టాలెంట్ ఉంటే.. కష్టపడితే ఏదైనా సాధించవచ్చని శేష్ మరోసారి ప్రూవ్ చేశాడు” అన్నారు. ‘క్షణం’.. ‘గూఢచారి’ లాంటి సినిమాలతో ఇప్పటికే శేష్ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడని.. ఇప్పుడు మరోసారి ‘ఎవరు’తో ప్రేక్షకులను మెప్పించాడని అన్నాడు. నిన్న శేష్ ను ‘ఏం సినిమాలు చేస్తున్నావు’ అని అడిగాను. రెండు సినిమాలు చేస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత మా బ్యానర్ లో ఇలాంటి కథ ఉంటే మా బ్యానర్ లో చెయ్యమని చెప్పాను.. ఒక కథ ఎలా ఉంది అంటే నేను చెప్పగలను కానీ నేను ఇలాంటి ట్విస్టులు ఉండే సినిమాలను జడ్జ్ చేయలేను. ఇలాంటి వాటిపై శేష్ కు మంచి గ్రిప్ ఉంది” అన్నారు. మొత్తానికి శేష్ బూరెల బుట్టలో పడ్డట్టే. రాజుగారి బ్యానర్ లో ఆఫర్ అంటే అంతకంటే కావల్సిందేముంది!
Please Read Disclaimer