రిలీజ్ డేట్ల వ్యవహారం.. రాజుగారి హ్యాండ్ ఉందా?

0

ఈ సంక్రాంతికి రిలీజ్ కానున్న ‘సరిలేరు నీకెవ్వరు’.. ‘అల వైకుంఠపురములో’ సినిమాల విడుదల తేదీల విషయం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది. ఓ వారం క్రితం వరకూ ‘సరిలేరు నీకెవ్వరు’ జనవరి 11 న.. ‘అల వైకుంఠపురములో’ జనవరి 12 న విడుదల అవుతాయని అన్నారు. కానీ ఇప్పుడు బన్నీ టీమ్ తమ సినిమాను 10 వ తేదీ విడుదల చేసేందుకు పావులు కదుపుతూ ఉండడంతో ఒక్కసారిగా రిలీజ్ డేట్ల సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.

రిలీజ్ డేట్ల విషయంలో పైకి ఓపెన్ గా చెప్పకపోయినా మొదటినుంచి వినిపిస్తున్న టాక్ ఏంటంటే హీరోలు ఈగోకు పోతున్నారు.. బయర్లు.. డిస్ట్రిబ్యూటర్ల క్షేమం కంటే ఇతర అంశాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని అంటున్నారు. అయితే ఇదొక్క అంశమే కాదని.. నిర్మాత కం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కూడా ఈ సమస్యకు కొంత కారణమనే వాదన వినిపిస్తోంది. సరిలేరు 11 న.. అల 12 న రిలీజ్ అని ఒప్పందం కుదిరినప్పుడు దిల్ రాజు ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఇద్దరికి సమానంగా థియేటర్లు ఇస్తామని చెప్పారట. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి రాజుగారు ఒక నిర్మాత..మహేష్ నెక్స్ట్ సినిమాను కూడా దిల్ రాజు నిర్మిస్తున్నారు. దీంతో ఆయన మహేష్ వైపు మొగ్గు చూపిస్తున్నారట. ఇది అల్లు అర్జున్ క్యాంప్ కు ఇబ్బందిగా మారిందని అంటున్నారు.

ఇప్పుడు బన్నీ సినిమా డేట్ ను 10 కి మార్చడంతో రాజుగారు బన్నీ సినిమాకు థియేటర్లు ఇవ్వనని అన్నారట. అలాగే అల్లుఅరవింద్ కంట్రోల్ లో ఉన్న థియేటర్లు తమ సినిమాకు ఇవ్వకపోయినా ఓన్ గా రిలీజ్ చేసుకుంటామని.. తమ థియేటర్లతో మ్యానేజ్ చేసుకుంటామని చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇది నిజమే అయితే అల్లు అరవింద్ కూడా సీనియర్ కాబట్టి తగ్గే ప్రశ్న ఉండదు. ఆయన కూడా ఏదో ఒక చక్రం తిప్పుతారు. ఇలా పంతాలకు పట్టింపులకు పోతే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందా అనేది ఇప్పుడు భేతాళ ప్రశ్న.
Please Read Disclaimer