‘వాల్మీకి’ వాయిదా అధికారికం

0

ఈనెల 30న మోస్ట్ అవైటెడ్ `సాహో` అత్యంత క్రేజీగా రిలీజవుతోంది. ఆ తర్వాత అక్టోబర్ 2న మరో భారీ చిత్రం `సైరా` అంతే ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ రెండు సినిమాలకు మధ్యలో మరో రెండు సినిమాలపైనా జనాల్లో ఆసక్తి నెలకొంది. `నాని`స్ గ్యాంగ్ లీడర్ – వాల్మీకి చిత్రాల రిలీజ్ ల గురించి పరిశ్రమలో ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నారు. ఈ రెండు సినిమాల టీజర్లు ఇప్పటికే అభిమానుల్లోకి దూసుకెళ్లాయి. నాని.. వరుణ్ తేజ్ ఇద్దరూ సంథింగ్ ఏదో వైవిధ్యంగా ట్రై చేస్తున్నారు అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఆ క్రమంలోనే ట్రైలర్ల లాంచింగ్ కి ఇరు బృందాలు సన్నాహకాల్లో ఉన్నాయి.

అయితే ఈ రెండు సినిమాల రిలీజ్ తేదీ సెప్టెంబర్ 13 అంటూ ప్రకటించడంతో క్లాష్ తప్పదని అంతా భావించారు. కానీ ఎట్టకేలకు నిర్మాతల మధ్య చర్చలు ఫలించాయి. ఈ రెండు సినిమాల్ని ఒకే రోజు రిలీజ్ చేయడం సరికాదని నిర్ణయానికి వచ్చారు. దీంతో వాల్మీకి చిత్రాన్ని సెప్టెంబర్ 20కి వాయిదా వేస్తున్నామని అధికారికంగా 14 రీల్స్ అధినేతలు ప్రకటించారు. నేడు హైదరాబాద్ లో జరిగిన ఓ సమావేశంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ఈ వాయిదా సంగతిని వెల్లడించారు.

సాహో- సైరా లాంటి రెండు భారీ రిలీజ్ ల గురించి మాట్లాడుకుంటున్న జనం .. ఈ రెండు సినిమాల(వాల్మీకి- గ్యాంగ్ లీడర్ ) పైనా ఆసక్తిగానే ఉన్నారు. అయినా ఒకరితో ఒకరు మాట్లాడుకుని ఒక అంగీకారానికి వచ్చారు. సెప్టెంబర్ 13న `నాని`స్ గ్యాంగ్ లీడర్ యథాతథంగా ముందే ప్రకటించిన తేదీకే రిలీజవుతోంది. సెప్టెంబర్ 20న వరుణ్ తేజ్ `వాల్మీకి` చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైత్రి నిర్మాతలు .. 14 రీల్స్ అధినేతలు పాల్గొన్నారు. వాల్మీకి చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. నానిస్ గ్యాంగ్ లీడర్ కి విక్రమ్.కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home