రీమేక్ సినిమా… నో అప్డేట్స్

0

తమిళ్ గతేడాది సూపర్ హిట్టైన ’96’ సినిమాను ఏరికోరి మరీ తెలుగు రీమేక్ రైట్స్ తెచ్చుకున్నాడు దిల్ రాజు. చాలా నెలలు దర్శకుడెవరు..? హీరో -హీరోయిన్స్ ఎవరు అనే చర్చ నడిచింది. ఎట్టకేలకు తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ నే ఫైనల్ చేసారు. ఆ తర్వాత శర్వానంద్-సమంతలను సెలెక్ట్ చేసారు.

లాంచ్ చేసి సెట్స్ పైకి తీసుకెళ్ళారు. అంతే అప్పటి నుండి ఈ సినిమా గురించి ఒక్క అప్ డేట్ కూడా బయటికి రాలేదు. డిసెంబర్ రిలీజ్ అంటూ టాక్ వచ్చినా మేకర్స్ నుండి మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇటివలే షూటింగ్ పూర్తయిందని అంటున్నా ప్రొడక్షన్ హౌజ్ నుండి ఎలాంటి సమాచారం లేదు.

అయితే ఇన్నేళ్ళ కెరీర్ లో మొదటి సారి ఓ రీమేక్ సినిమాను నిర్మిస్తున్న దిల్ రాజు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా రిలీజ్ డేట్ కూడా ప్రకటించకుండా ఎందుకు గుట్టుగా ఉంచుతున్నారో అర్థం కావట్లేదు. ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా మీద మాత్రమే దిల్ రాజు ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది. ఈ దీపావళికి కూడా అప్డేట్ రాకపోతే ఇక రాజు గారి ’96’ ను ప్రేక్షకులు లైట్ తీసుకోవడం ఖాయం.
Please Read Disclaimer