దిల్ రాజు 20 ఇయర్స్ ఇండస్ట్రీ.. భారీ ప్లాన్స్!

0

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ స్థాపించి దాదాపు పదహారేళ్ళయింది. ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటిగా ఎదిగింది. అయితే రాజుగారు తన సినీ రంగ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి ఇరవై ఏళ్ళు పూర్తయింది. నిర్మాతగా మారక ముందు ఆయన బయ్యర్ గా.. డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ ఇరవై ఏళ్ళ ప్రయాణం సందర్భంగా రీసెంట్ గా ఒక వెబ్ ఛానెల్ కు రాజుగారు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

బయ్యర్ గా కెరీర్ ప్రారంభించి అగ్ర నిర్మాతగా ఎదిగారు.. ఎగ్జిబిషన్ రంగంలో కూడా ఆయన తన సత్తా చాటారు.. రాజుగారిని మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అని ప్రశ్నిస్తే వచ్చే ఏడాది బాలీవుడ్ సినిమాను ప్లాన్ చేస్తున్నామని వెల్లడించారు. ఇదే కాకుండా మరో భారీ ప్లాన్ కూడా వెల్లడించారు. ఇండస్ట్రీలో ఉన్న మంచి అభిరుచి కల మీడియం రేంజ్ నిర్మాతలను ఎనిమిది మందిని ఎంపిక చేసుకొని వారితో అసోసియేట్ అవుతున్నారట. వారిలో బెక్కం వేణుగోపాల్.. శివలెంక కృష్ణప్రసాద్.. మహేష్ కోనేరు.. కృష్ణ (జవాన్ నిర్మాత)… రాహుల్ యాదవ్ నక్కా(ఏజెంట్ ఆత్రేయ నిర్మాత)..రాజీవ్ రెడ్డి..చిల్లా శశి (యాత్ర నిర్మాత) ఉన్నారు. వీరిలో ఎవరైనా మంచి సబ్జెక్ట్ కనుక తీసుకు వస్తే.. ఆ సబ్జెక్ట్ దిల్ రాజుకు నచ్చితే ప్రాజెక్ట్ ఫండింగ్..మార్కెటింగ్ అంతా రాజుగారు చూసుకుంటారట. ఎగ్జిక్యూషన్ మాత్రం ఆ నిర్మాతకే అప్పగిస్తారట రాజుగారు. వీరందరూ వైవిధ్యమైన కంటెంట్… ఈ తరం ప్రేక్షకులకు నచ్చే సినిమాలను నిర్మిస్తున్నారని.. అందుకే వారితో అసోసియేట్ అవుతున్నానని తెలిపారు.

ఇక రివ్యూల గురించి మాట్లాడుతూ ఓపెన్ గా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రివ్యూల ప్రభావం పెద్ద సినిమాలపై దాదాపు ఉండదని అన్నారు. ఎందుకంటే హీరోను.. డైరెక్టర్ ను చూసి సినిమాలు చూసే ఫ్యాన్స్ ఉంటారని.. యావరేజ్ గా ఉన్నా సినిమా అయినా రన్ అవుతుందని అభిప్రాయపడ్డారు. అయితే చిన్న సినిమాలపై మాత్రం రివ్యూలు తీవ్ర ప్రభావం చూపిస్తాయని అన్నారు. ఒక చిన్న సినిమాకు మంచి రివ్యూలు వస్తే రిలీజ్ రోజు సాయంత్రం నుంచి టికెట్ బుకింగ్స్ పెరుగుతాయని అన్నారు.
Please Read Disclaimer