దిల్ రాజు మళ్లీ పెళ్లి.. నిజమెంత?

0

నిర్మాతకు సెలబ్రిటిలీ స్టేటస్ తీసుకొచ్చిన ఘనత కచ్ఛితంగా దిల్ రాజుదేనని చెప్పాలి. తెలుగు చిత్రాలకు సంబంధించి నిర్మాతలు కేవలం డబ్బుల పెట్టె పట్టుకొచ్చేవాడన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేయటమే కాదు.. ఎవరిని ఎలా డీల్ చేయాలన్న విషయాన్ని దిల్ రాజు పుణ్యమా అని చాలామంది నేర్చేసుకున్నారని చెప్పాలి. తెలుగు సినిమాలను తీసే విషయంలో రామానాయుడు.. రామోజీరావు లాంటి స్టార్ ప్రొడ్యూసర్లు వెనక్కి తగ్గిన తర్వాత.. దాన్ని కార్పొరేట్ స్టైల్లో మార్చేసి సినిమాలు తీయటంలో కొత్త పుంతలు తొక్కించిన ఘనత రాజు గారి పుణ్యమే.

సినిమాలు తీయటంతోనే సరిపెట్టుకోకుండా.. థియేటర్ల మీద పట్టును సాధించటం లోనూ సక్సెస్ అయ్యారు. ఈ రోజున టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ల లో ఒకరుగానే కాదు.. డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఆయనకున్న పేరు అంతా ఇంతా కాదు. ప్రొఫెషన్ పరంగా ఇంత సక్సెస్ ఉన్నా.. వ్యక్తిగత జీవితంలో భారీ విషాదమే ఆయనకు ఉంది. ఆయన సతీమణి అనిత కొద్ది రోజుల క్రితం అనారోగ్యం తో మరణించారు. ఆ తర్వాత తన ఒక్కగానొక్క కుమార్తెకు పెళ్లి చేశారు. ఇప్పుడాయన ఒక్కడే ఉంటున్నారు.

సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా.. ఇంటికి వచ్చిన తర్వాత నా అనే వాళ్లు ఒకరు మనకున్నారంటే ఆ లెక్కే వేరుగా ఉంటుంది. బయట ఉన్న పేరు ప్రఖ్యాతుల్ని పక్కన పెడితే.. ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత చుట్టూ శూన్యత ఉంటే దాన్ని భరించటం మామూలు విషయం కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే దిల్ రాజు ఉన్నట్లు చెబుతున్నారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సినిమా ఇండస్ట్రీతో ఏ మాత్రం సంబంధం లేని ఒక బ్రాహ్మణ యువతిని దిల్ రాజు పెళ్లి చేసుకోనున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ వార్తలో ఎంత నిజమన్నది ఇప్పుడు తేల్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండో పెళ్లి ఏ మాత్రం తప్పు కాదు. అందునా.. దిల్ రాజు లాంటి వ్యక్తి ఉన్న పరిస్థితుల్లో తప్పనిసరి అని చెప్పక తప్పదు. మరి.. తన పెళ్లి గురించి దిల్ రాజు అధికారికం గా ఎంత త్వరగా క్లారిటీ ఇస్తే అంత బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Please Read Disclaimer