సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

సంక్రాంతి విజేత ఎవరంటే దిల్ రాజు సమాధానం ఇది

0

సంక్రాంతి కానుకగా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో దర్బార్ మరియు ఎంత మంచి వాడవురా చిత్రాలు ఆకట్టుకోలేక మొదటి వారంలోనే చాప చుట్టేశాయి. కాని అల వైకుంఠపురంలో మరియు సరిలేరు నీకెవ్వరు చిత్రాలు మాత్రం బాక్సాపీస్ వద్ద మోత మ్రోగించాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా కంటే కూడా అల వైకుంఠపురంలో చిత్రం భారీ వసూళ్లను రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అంటూ బన్నీ అండ్ టీం ప్రకటనలు గుప్పిస్తున్నారు.

కొన్ని చోట్ల బాహుబలి 1 రికార్డును కూడా బ్రేక్ చేసిందని అల వైకుంఠపురంలో చిత్ర యూనిట్ సభ్యులు చాలా సంతోషంగా చెప్పుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రముఖ నిర్మాత మరియు అంతకు మించి ట్రేడ్ విశ్లేషకుడు అయినటువంటి దిల్ రాజును ఈ సంక్రాంతి విజేత ఎవరు అంటూ ప్రశ్నించగా ఆయన అటు ఇటు తిప్పి ఇద్దరు కూడా సంక్రాంతి విజేతలే అన్నట్లుగా ప్రకటించారు.

కొన్ని ఏరియాల్లో సరిలేరు నీకెవ్వరు ఆల్ టైం రికార్డును దక్కించుకుంటే కొన్ని సెంటర్స్ కొన్ని ఏరియాల్లో అల వైకుంఠపురంలో చిత్రం రికార్డును సొంతం చేసుకుంది. ఒక సినిమా బాహుబలి 1 రికార్డును బ్రేక్ చేస్తే ఇంకో సినిమా కొన్ని సెంటర్స్ లో బాహుబలి 2 రికార్డులను కూడా బ్రేక్ చేసింది. అందుకే ఇద్దరు హీరోలకు కూడా ఈ చిత్రం వారి కెరీర్ లో ఆల్ టైం హిట్ అని చెప్పాడు. కాని రెండు సినిమాలను పోల్చినప్పుడు మాత్రం ఆయన సరైన సమాధానం చెప్పలేదు. ఈ రెండు సినిమాలను కూడా దిల్ రాజు పంపిణీ చేశాడు. ఆ సినిమాల సంగతి ఏమో కాని ఈ రెండు సినిమాల వల్ల దిల్ రాజు మాత్రం బాగా లాభాలు దక్కించుకుని విజేతగా నిలిచాడని చెప్పుకోవచ్చు.
Please Read Disclaimer