దిల్ రాజు కి కీలక పరీక్ష

0

ప్రస్తుతం నిర్మాతగా బిజీ బిజీగా సినిమాలు చేస్తున్న బడా నిర్మాత దిల్ రాజు మరో రెండు చిన్న సినిమాల రిలీజ్ బాధ్యతను తీసుకున్నాడు. రవి బాబు ‘ఆవిరి’ అలాగే రాకేష్ నటించిన ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ సినిమాలను దిల్ రాజు సమర్పిస్తూ విడుదల చేస్తున్నారు. నిజానికి ఈ రెండు సినిమాలు రాజు గారి కి టాస్కె. ఇకపై వరుసగా చిన్న సినిమాలను రిలీజ్ చేస్తూ సురేష్ బాబు లా మారాలని చూస్తున్నాడు.

గతంలోనూ ఇలాంటి చిన్న సినిమాలను ఆయన విడుదల చేసి దెబ్బ తిన్నాడు రాజు. ఆ సినిమాలకు కలెక్షన్స్ సంగతి పక్కనపెడితే బిజినెస్ కూడా జరగలేదు. కానీ ఈసారి ఈ చిన్న సినిమాలతో ఎంతో కొంత కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు తిరిగిచ్చి తను కూడా కొంత మిగిలించుకోవాలని చూస్తున్నారు.

రాజు గారు విడుదల చేస్తున్న ఈ సినిమాల్లో ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ సినిమా దసరా కానుకగా థియేటర్స్ లోకి వస్తుంది. కాస్ట్ ఫీలింగ్ కథాంశంతో ఎంటర్టైనింగ్ గా తెరకెక్కిన ఈ సినిమాకు హీరోనే నిర్మాత. ఇక రవి బాబు ‘ఆవిరి’ సినిమా అక్టోబర్ 13న థియేటర్స్ లోకి వస్తుంది. లేటెస్ట్ గా ‘అదుగో’ అంటూ మరో ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్న రవిబాబుకి ఇప్పుడు ఆవిరి విజయం చాలా కీలకం. టీజర్స్ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. కానీ రిలీజ్ తర్వాత సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.
Please Read Disclaimer