రాజు గారి బ్యానర్ నుండి ముగ్గురు

0

టాలీవుడ్ లో లాంచింగ్ బ్యానర్స్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఒకటి. ఈ సంస్థ నుండి ఇప్పటికే చాలా మంది దర్శకులు లాంచ్ అయి సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడీ బ్యానర్ నుండి ఓ ముగ్గురు దర్శకులు లాంచ్ అవ్వబోతున్నారు. త్వరలోనే శశి అనే కుర్రాడిని దర్శకుడిగా పరిచయం చేయనున్నాడు దిల్ రాజు. శశి సినిమా చైతుతో ఉంటుందని అంటున్నారు.

ఇదే బ్యానర్ లో శిరీష్ అబ్బాయి ఆశిశ్ రెడ్డి హీరోగా తెరకెక్కుతున్న సినిమాతో అశోక్ అనే దర్శకుడు లాంచ్ అవుతున్నాడు. ‘పలుకే బంగారమాయేనా’ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ రెండు సినిమాలకు సంబంధించి దర్శకుల పేర్లు కూడా అనౌన్స్ చేసేసిన దిల్ రాజు లేటెస్ట్ గా మరో డెబ్యూ డైరెక్టర్ ని అనౌన్స్ చేసారు.

అతనే హరి. లేటెస్ట్ గా ‘మహర్షి’ సినిమాకు రచనా సహకారం అందించిన హరి వినాయక్ ‘సీనయ్య’ సినిమాకు కూడా స్క్రిప్ట్ సైడ్ పని చేసాడు. ఈ రెండు సినిమాల కథ విషయంలో హరి ప్రతిభ చూసిన రాజు గారు లేటెస్ట్ గా హరి తన బ్యానర్ లోనే దర్శకుడిగా పరిచయం కానున్నాడని ప్రెస్ మీట్ లో చెప్పేసారు. సో త్వరలోనే హరిను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నాడు దిల్ రాజు. మరి ఈ ముగ్గురు ఎస్.వి.సీ బ్యానర్ నుండి వచ్చిన సక్సెస్ ఫుల్ దర్శకుల లిస్టులో చేరతారా చూడాలి.
Please Read Disclaimer