మా ఫ్యామిలీ లో కూడా హీరో ఉన్నాడు: దిల్ రాజు

0

దిల్ రాజు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దిల్ సినిమాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత అదే సినిమా పేరును ఇంటిపేరుగా మార్చుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తున్నారు. దిల్ రాజు మూవీ అంటే చక్కగా ఫ్యామిలీ మొత్తం థియేటర్ కి వెళ్లి చూడొచ్చనే ప్రేక్షకులు భావిస్తారు.

తన నిర్మాణంలో ఎన్నో గొప్ప విజయాలను చవిచూసిన దిల్ రాజు రీసెంట్ గా సరైన హిట్లను అందుకోలేకపోయాడు. రీసెంట్ గా ఆయన తమ్ముళ్లను కూడా సినీ ఇండస్ట్రీకి నిర్మాతలుగా పరిచయం చేసాడు. పెద్ద పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలను కూడా దిల్ రాజు నిర్మిస్తుంటాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హిందీ రీమేక్ వకీల్ సాబ్ నిర్మాణంలో ఉండగానే మరో చిన్న సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.

ఈ సినిమాతో బయట హీరోలను కాకుండా తన తమ్ముడు శిరీష్ కొడుకు ఆశిష్ రెడ్డిని హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘పలుకే బంగారమాయెరా..’ అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు హుషారు ఫేమ్ శ్రీ హర్ష దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. మరి బడా నిర్మాత అయిన దిల్ రాజుకు తన ఇంటి నుండి హీరోను పరిచయం చేయాల్సిన అవసరం ఏముంది..? ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కనుంది? అనే విషయాలు తెలియాల్సి ఉంది.




Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-