మోడీ.. దిల్ రాజుకు ఎలా ఛాన్సిచ్చాడబ్బా?

0

మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన కోసం సినీ పరిశ్రమతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించిన సమావేశం పెద్ద వివాదానికే దారి తీసింది. ఇప్పటికే ప్రభుత్వ పరంగా దక్షిణాది మీద చూపిస్తున్న వివక్షపై సౌత్ జనాలు మండి పడుతున్నారు. ఇది చాలదన్నట్లు సినీ పరిశ్రమతో సమావేశం అని చెప్పి.. బాలీవుడ్ వాళ్లతోనే ఆ సమావేశాన్ని నింపేయడం విమర్శలకు దారి తీసింది. దక్షిణాదిన చాలామంది దిగ్గజాలు పెద్ద పెద్ద స్టార్లు ఉన్నా పీఎంఓ పట్టించుకోవడం దారుణం. అయితే ఈ సమావేశంలో దక్షిణాది సినిమాకు ప్రతినిధి అన్నట్లుగా మన దిల్ రాజు ప్రత్యక్షం కావడం ఆశ్చర్యపరిచింది.

ముందు నిజంగా దిల్ రాజు ఈ మీటింగ్లో పాల్గొన్నాడా.. మోడీ సమావేశంలో రాజు ఉన్నట్లుగా కనిపిస్తున్న ఫొటో మార్ఫింగా అన్న సందేహాలు కూడా తలెత్తాయి. కానీ మోడీ స్వయంగా రిలీజ్ చేసిన ఫొటోల్లో దిల్ రాజు కనిపించడం తర్వాత రాజు సైతం తన సంస్థ ట్విట్టర్ అకౌంట్ ద్వారా తాను ఈ సమావేశంలో పాల్గొన్నట్లు వెల్లడించడంతో సందేహాలు తొలగిపోయాయి. ఐతే దిల్ రాజు ఒక్కడిని ఈ సమావేశానికి ఎందుకు ఆహ్వానించారు.. మిగతా వాళ్ల పరిస్థితేంటో అన్న చర్చ మొదలైంది. బహుశా దిల్ రాజు జెర్సీ రీమేక్తో బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న నేపథ్యంలో ఆయన్ని కూడా బాలీవుడ్ కోటాలోనే సమావేశానికి పిలిచారేమో అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తుండటం విశేషం.
Please Read Disclaimer