షారూక్ వల్ల అట్లీ లో డైలమా!

0

కింగ్ ఖాన్ షారూక్ కెరీర్ రెండు మూడేళ్లు గా పూర్తిగా డిఫెన్స్ లో పడిన సంగతి తెలిసిందే. వరుసగా చేస్తున్న సినిమాలేవీ సత్ఫలితాలు ఇవ్వడం లేదు. ఎంతో ప్రాణ పదంగా నమ్మి చేసిన జీరో చిత్రం సైతం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది. స్ట్రెయిట్ కమర్షియల్ కథల తో పాటు ప్రయోగాలు తనకు కలిసి రాలేదు. దీంతో ఎంతో ఓపిగ్గా ఆలోచించి ఓ సౌత్ దర్శకుడికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలోనే సౌత్ లో వరుస బ్లాక్ బస్టర్ల తో సత్తా చాటిన అట్లీ వినిపించిన లైన్ కి ఓకే చెప్పాడు.

ఏడాది కాలంలో అట్లీ నాలుగైదు సార్లు బాద్ షాని కలిసి కథ వినిపించే ప్రయత్నం చేశారు. ఇటీవలే పూర్తి స్క్రిప్టును వినిపించారు. ఆ క్రమంలోనే నవంబర్ 2న ఠెంకాయ కొట్టి షారూక్- అట్లీ చిత్రానికి ముహూర్తం కూడా చేసేశారు. కానీ ఇంతలోనే ఏమైందో బాద్ షా ఈ ప్రాజెక్టును హోల్డ్ లో పెట్టారని తెలుస్తోంది. స్క్రిప్టు విషయం లో పూర్తి సంతృప్తి గా లేక పోవడం వల్లనే ఇలా చేశారట.

ప్రస్తుతం అట్లీ ఈ స్క్రిప్టు పై రీవర్క్ చేస్తున్నారు. మరోసారి పూర్తి స్థాయి నేరేషన్ ఇచ్చి బాద్ షాని ఒప్పించే ప్రయత్నం చేస్తారట. షారూక్ సూచించిన మేరకు మార్పులు చేర్పులు చేసి కలవాల్సి ఉంది. ఆ తర్వాతనే రెగ్యులర్ చిత్రీకరణను ప్రారంభిస్తారు. ఇకపోతే ఇప్పటికే ఇలయ దళపతి విజయ్ కి హ్యాట్రిక్ హిట్లు ఇచ్చిన అట్లీ ఎట్టి పరిస్థితి లో కింగ్ ఖాన్ తో సినిమా తీయాలని పంతంతో ఉన్నాడు. అలాగే ఎన్టీఆర్ హీరోగా ఓ తెలుగు-తమిళ్ ద్విభాషా చిత్రానికి సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer