బిడ్డొచ్చిన వేళ.. డబుల్ ధమాకా షురూ

0

బిడ్డొచ్చిన వేళా విశేషం అంటారు! ఆ రకంగా చూస్తే సరిలేరు దర్శకుడు అనీల్ రావిపూడికి అన్ని రకాలా కలిసొచ్చిందనే తాజా సన్నివేశం చెబుతోంది. ఓవైపు తన కెరీర్ ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్ `సరిలేరు నీకెవ్వరు` సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వస్తోంది. ఈలోగానే డబుల్ జాక్ పాట్ తగిలింది. అనీల్ వైఫ్ భార్గవి సుపుత్రునికి జన్మనిచ్చి అరుదైన గిఫ్ట్ నే హబ్బీకి కానుకగా ఇచ్చింది.

అనీల్ రావిపూడి- భార్గవి జంటకు ఇప్పటికే కూతురు ఉంది. ఇప్పుడు రెండో సంతానంగా కుమారుడు జన్మించాడు. అందుకు చాలా సంతోషంలో ఉందీ జంట. హైదరాబాద్ రెయిన్ బో ఆస్పత్రిలో భార్గవి బిడ్డకు జన్మనిచ్చారని తెలుస్తోంది. బిడ్డొచ్చిన వేళా విశేషంతో `సరిలేరు నీకెవ్వరు` ని బ్లాక్ బస్టర్ చేసి మరో లెవల్ ని టచ్ చేస్తాడేమో చూడాలి. ఇక నేటి సాయంత్రం సరిలేరు- మెగా సూపర్ ఈవెంట్ కి ఇప్పటికే వెన్యూ ఎల్ బి స్టేడియం లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు సాగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నారు కాబట్టి ఈవెంట్ కి మెగా అభిమానుల తాకిడి ఉండనుంది. అందుకు తగ్గ సెక్యూరిటీ ఏర్పాట్లు సాగుతున్నాయి.

అనీల్ రావిపూడి వారసుడికి వెల్ కం చెప్పిన సందర్భంగా .. తన హీరో మహేష్ స్పందిస్తూ.. ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. “షైన్ ఆన్ బ్రదర్..“ అంటూ మహేష్ విషెస్ తెలిపారు. ఇది కేవలం అనీల్ ఒక్కడికే కాదు.. సరిలేరు టీమ్ కి కూడా బిగ్ న్యూస్ అనే చెప్పాలి.
Please Read Disclaimer